Covid 19 Positive: సౌత్ ఇండియాలో మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా... న్యూ ఇయర్ కంటే ముందే!
కరోనా ఖాతాలో మరో స్టార్ హీరోయిన్ చేరారు. న్యూ ఇయర్ కంటే ముందే తాను కరోనా బారిన పడినట్టు వెల్లడించారు.
కరోనా మూడో దశలో మహమ్మారి వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు ఎస్. తమన్, నటి లక్ష్మీ మంచు, హీరో మంచు మనోజ్, విశ్వక్ సేన్, హీరో నితిన్ భార్య షాలిని కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు త్రిష కూడా చేరారు. తనకు కరోనా సోకినట్టు శుక్రవారం రాత్రి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.
"ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు అన్నీ తీసుకున్నా సరే... న్యూ ఇయర్ కంటే కొంచెం ముందు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు మీరు చెప్పండి... అవన్నీ నాకు ఉన్నాయి. రోజులు భారంగా, బాధగా గడిచినా... నేను కోలుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఈ రోజు బావున్నాను. ఫీలింగ్ బెటర్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, తప్పనిసరిగా మాస్క్ ధరించండి. త్వరగా కరోనా టెస్టుల్లో నెగెటివ్ అని వస్తుందని, ఇంటికి తిరిగి వెళతానని ఆశిస్తున్నాను. నేను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని త్రిష పేర్కొన్నారు.
— Trish (@trishtrashers) January 7, 2022
సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు హిందీ సినిమా ఇండస్ట్రీలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. చాప కింద నీరులా చుట్టేస్తోంది. కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరా తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం జాన్ అబ్రహం దంపతులు, నటి స్వరా భాస్కర్ తదితరులు కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆ విషయం చెబుతున్నారు. తమకు కరోనా అని చెప్పడంతో పాటు ప్రేక్షకులను జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు.
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి తమన్‌కు... తమన్ నుంచి ఎవరికి? నెక్స్ట్ ఎవరు??
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.