News
News
వీడియోలు ఆటలు
X

తారక్‌తో సమానంగా డ్యాన్స్ చేయడం చాలా కష్టం - ‘సింహాద్రి’ రోజులు గుర్తుచేసుకున్న నటి అంకిత

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహాద్రి' మూవీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ కాగా.. నటి అంకిత ఎన్టీఆర్ కు మ్యాజికల్ లెగ్స్ ఉన్నాయని, గ్రేస్ ఫుల్ డ్యాన్సర్ అని ఆమె కొనియాడారు

FOLLOW US: 
Share:

Simhadri : 2003లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన 'సింహాద్రి' మరోసారి రికార్డులు సృష్టిస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా తారక్ బర్త్ డే సందర్భంగా (మే 20న) రీరిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా భూమిక చావ్లా, అంకిత నటించారు. తాజాగా అంకిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో తెలియజేశారు. దాంతో పాటు ఆమె ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించిన మాట్లాడిన అంకిత... అతనికి మ్యాజికల్ లెగ్స్ ఉన్నాయని ప్రశంసలు గుప్పించారు. ఎన్టీఆర్ చాలా గ్రేస్ ఫుల్ డ్యాన్సర్ అని చెప్పారు. అతనితో సమానంగా డ్యాన్స్ చేయడం చాలా కష్టంతో కూడుకుందని ఆమె తెలిపారు. కానీ కొరియోగ్రాఫర్ చాలా హెల్ప్ చేశారని, బాగా ప్రాక్టిస్ చేయించారని అంకిత చెప్పుకొచ్చారు. అలా తామిద్దరి మధ్య మూమెంట్స్ వర్కవుట్ అయ్యాయన్నారు. ఇక తారకరత్న సెట్స్ పై ఎలా ఉంటారన్న విషయానికొస్తే.. ఆయన చాలా హంబుల్ గా ఉంటారని, చాలా కోపరేపటివ్ గా ఉంటారని అంకిత చెప్పారు. అందుకే ఈ మూవీలో తాను ఈజీగా చేయగలిగానన్నారు.

ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ రౌండర్, ఆల్ ఇన్ వన్ అంటూ అంకిత కితాబిచ్చారు. ఈ సినిమా ద్వారా తాను ప్రేక్షకులకు కృతజ్ఞతలు చేప్పాలని అనుకుంటున్నానని తెలిపారు. మళ్లీ ‘సింహాద్రి’ సినిమాను హై క్వాలిటీలో థియేటర్లలో చూడండని అంకిత కోరారు. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన లైఫ్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

రీసెంట్ డేస్ లో టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవలే రిలీజైన 'సింహాద్రి' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రీ రిలీజ్ మూవీస్ లో  బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 5.2కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో సింహాద్రి సినిమా ఆల్ టైం రికార్ట్ సినిమాల లిస్ట్ లోకి చేరిపోయింది.

టాలీవుడ్ లో ఇటీవల రీరిలీజ్ అయిన పలు సినిమాలు ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఆ జాబితాలో అల్లు అర్జున్ దేశముదురు, పవన్ కల్యాణ్ ఖుషీ, జల్సా, మహేశ్ బాబు పోకిరి, రామ్ చరణ్ 'ఆరెంజ్ 'లు కూడా ఉన్నాయి. రీరిలీజ్ అయిన సినిమాలలో 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ‘ఖుషి’ మూవీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు దాన్ని సింహాద్రి మూవీ బీట్ చేసింది. ఇటీవలి కాలంలో కొత్తగా విడుదలైన సినిమాలకు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు. అలాంటి రీరిలీజ్ అయిన ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో. ఇక సీడెడ్‌లో ఏకంగా రూ.76 లక్షలు సాధించి అక్కడ తన బ్రాండ్‌ ఏంటో మరోసారి రుజువు చేశాడు. భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఆ స్థాయిలో సీడెడ్‌లో కలెక్షన్‌లు సాధించలేపోయాయి.

Read Also : Bichagadu 2 Collections : ఏపీ, తెలంగాణలో దుమ్ము రేపిన 'బిచ్చగాడు 2' - విజయ్ ఆంటోనీ సినిమా ఓపెనింగ్స్ ఎంతంటే?

Published at : 21 May 2023 04:33 PM (IST) Tags: SS Rajamouli Bhumika Chawla Junior NTR simhadri Ankitha

సంబంధిత కథనాలు

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా

ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు