Nayan Vignesh Wedding Teaser: పెళ్లి కూతురిగా నయన్ ఎంత అందంగా రెడీ అయ్యిందో చూశారా? పెళ్లి వేడుక టీజర్ రిలీజ్
నయనతార- విఘ్నేశ్ శివన్ అందమైన లవ్ డాక్యుమెంటరీ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రానుంది. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.
లేడి సూపర్ స్టార్ నయన తార, విఘ్నేష్ శివన్ ప్రేమ, పెళ్లి అన్నీ హాట్ టాపిక్ అయ్యాయి. పెళ్ళైన తర్వాత ఆ జంట విదేశాల్లో హనీమూన్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోస్ కూడా ఆ జంట తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. చాలా మంది వివాహం అయిన వెంటనే మెడలో పసుపు తాడుతో ఉన్న తాళి బొట్టు తీసేసి కనిపిస్తారు. కానీ నయన్ మాత్రం సంప్రదాయానికి ఎంతో గౌరవం ఇచ్చి తన మెడలోనే ఉంచుకున్నారు. నయన్ పెళ్లి వేడుక హక్కులని నెట్ ఫ్లిక్స్ భారీగా చెల్లించి సొంతం చేసుకుంది. తాజాగా వారి పెళ్లి వేడుకకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
నయన్ పెళ్లి కూతురిలా ఎలా రెడీ అయ్యిందంటే?
పెళ్లి కూతురుగా నయన్ ఎంత చక్కగా ముస్తాబు అవుతున్నారో ఈ వీడియోలో చూపించారు. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. నయన్, విఘ్నేష్ పెళ్లి వేదికతో పాటు వారి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇందులో చూపించారు. సాధారణంగా నయన్ సోషల్ మీడియా, సినిమా ప్రమోషన్స్ నుంచి కూడా దూరంగా ఉంటుంది. అటువంటిది తొలిసారిగా ఇందులో ఇంటర్వ్యూలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
‘ఇదంతా మొదలైనప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలియదు. నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కూడా కాదు. నేను కేవలం ఒక సాధారణ అమ్మాయిని. ఏ పని చేసినా వంద శాతం ఇవ్వాలని అనుకుంటాను’ అని నయన్ చెప్పుకొచ్చారు. ఇక విగ్నేష్ మాట్లాడుతూ తన భార్యని ప్రశంసల్లో ముంచెత్తారు. నయనతార ఒక నటిగా కంటే అద్భుతమైన మనిషి అని కొనియాడారు. విఘ్నేశ్ శివన్, నయన్ ఇద్దరు చేతులు పట్టుకొని నడుచుకుంటూ ఉండటం తమ పెళ్లి వేడుక కోసం అందంగా ముస్తాబు అవడం మొత్తం ఇందులో చూపించారు. అయితే నయన్ పెళ్లి వేడుక పూర్తి స్థాయి స్ట్రీమింగ్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు.
Also Read : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు
రూమర్స్ కి చెక్ పెడుతూ..
విఘ్నేశ్, నయన్ పెళ్లి చేసుకున్నపుడు వారి ఫోటోస్ ని విఘ్నేశ్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు పెళ్లికి తాము ఖర్చుపెట్టిన సొమ్మును కూడా వెనక్కి ఇవ్వమని నెట్ ఫ్లిక్స్ అడిగిందని కూడా టాక్ నడిచింది. దాదాపు పాతిక కోట్ల రూపాయల దాకా ఈ సెలెబ్రిటీ జంట ఆ ఓటీటీ సంస్థకు చెల్లించాల్సి రావచ్చు అంటూ చాలా చర్చలు నడిచాయి. అయితే ఇదంత ఉత్త ట్రాష్ అని కొట్టిపడేసేలా నెట్ ఫ్లిక్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. త్వరలో అందమైన జంట ప్రేమకథను స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిది. దీంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఆ పోస్టులో నయనతార - విఘ్నేష్ అందమైన ఫోటోలను షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్. సముద్ర తీరాన అందమైన జంట కనుల పండవలా కనిపిస్తోంది.
ఏడేళ్ళ ప్రేమకి ఏడడుగుల బంధం
నయనతార ప్రేమలో రెండు సార్లు పెళ్లి దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఆమె లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు కూడా వైరల్ గా మారాయి. తర్వాత విఘ్నేశ్ తో ఏడేళ్ళ పాటు ప్రేమలో ఉంది. తర్వాత వారిద్దరూ సహజీవనం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఈ జంట తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ఏడాది జూన్ 9 న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఒక పెద్ద రిసార్ట్ లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను పాతికకోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఇక తమిళ నటులు రజనీకాంత్, సూర్య, జ్యోతిక, మణిరత్నం వంటి దిగ్గజాలు పాల్గొన్నారు.
Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!
Beyond the flashlights and fame, there lives a dream named Nayanthara 🥰#Tudum presents the story of her rise to superstardom - Nayanthara : Beyond the Fairy Tale, coming soon! pic.twitter.com/FMMAh8AQcc
— Netflix India (@NetflixIndia) September 24, 2022