(Source: ECI/ABP News/ABP Majha)
Nayanthara Vignesh Love Story: ఆ కథ చెప్పి ‘కణ్మని’ని ప్రేమలో పడేశాడు, ఇదీ నయన్-విఘ్నేష్ లవ్ స్టోరీ
గుండె ముక్కలవడానికి 2 నిమిషాలు చాలు. కానీ, పగిలిన గుండెను అతికించడానికి జీవితం సరిపోదు. అయితే, విఘ్నేష్ అది సాధించాడు. తొలి పరిచయంతోనే నయన్ నాలుగేళ్ల బాధను మరిపించాడు.
Nayanthara Vignesh Wedding | నయన తార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమకు ప్రమోషన్ లభించనుంది. జూన్ 9న నయన్-విఘ్నేష్‌లు పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఏడేళ్ల బంధాన్ని ఏడడుగులతో శాస్వతం చేసుకోనున్నారు. మరి రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయన్.. విఘ్నేష్ మనసును ఎలా గెలుచుకుంది? వీరి బంధం సుదీర్ఘంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగడానికి కారణం ఏమిటీ? అసలు వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఈ సందేహాలన్నీ తీరాలంటే వీరి ప్రేమ కథను తెలుసుకోవల్సిందే.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకుంది. దీంతో ఆమె మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. చెప్పాలంటే ఆమె చాలా ఏళ్లు గ్లామర్ పాత్రలతోనే నెట్టుకొచ్చింది. ఆమెకు నటిగా గుర్తింపు తెచ్చే ఒక్క మంచి పాత్ర కూడా లభించలేదు. అయితే, విఘ్నేష్ శివన్ పరిచయం ఆమె జీవితాన్నే కాదు.. సినిమాల్లో ఆమె పాత్రలను కూడా మార్చేసింది. ఆమెలో దాగిన నటనను వెలికి తీసింది విఘ్నేష్ శివన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి నయన్ గ్లామర్‌తో కాదు.. నటనతో తన విశ్వరూపం చూపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది.
ప్రేమ ఇలా మొదలైంది: విఘ్నేష్ శివన్ 2015లో నయనతారను మొదటిసారి కలిశాడు. ‘నానుమ్ రౌడీ ధాన్’ (తెలుగులో ‘నేను రౌడీనే’) సినిమా కథను వినిపించేందుకు ఆమెను కలిశాడు. ఆ కథ చెప్పిన తర్వాత విఘ్నేష్ ఆమెతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. చివరికి సినిమా షూటింగ్ సమయంలో కూడా వీరిద్దరూ పక్కకు వెళ్లి తెగ మాట్లాడుకొనేవారట. ‘నేను రౌడీనే’ సినిమాలో నటించిన మన్సూర్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నయనతార, విఘ్నేష్ శివన్‌లో లవ్‌లో ఉన్నారనే వార్తలను ఆ జంట ఖండించలేదు. 2017లో సింగపూర్‌లో జరిగిన అవార్డుల ఫంక్షన్‌కు నయన్, విఘ్నేష్‌లు కలిసి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసే ఉండటం, కలిసే అవార్డు వేడుకకు వెళ్లడం అప్పట్లో రూమర్స్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆ అవార్డుల వేడుకలో ‘నేనూ రౌడీనే’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డును విఘ్నేష్ సొంతం చేసుకున్నాడు. నయన తారకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ అవార్డుకు కారణం నయనతారేనని, ఆమె మనసు చాలా మంచిదని కితాబిచ్చాడు.
సినిమాలకు బ్రేక్.. ప్రభుదేవతో బ్రేకప్: రెండు బ్రేకప్స్ తర్వాత నయన తార చాలా ఒంటరిగా ఫీలైంది. సుమారు ఐదేళ్లపాటు నరకం అనుభవించింది. వాస్తవానికి నయనతార 2011లో కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాను పెళ్లి చేసుకోనుందనే ప్రచారం జరిగింది. 2010లో ప్రభుదేవ తన భార్యతో విడాకులు తీసుకోవడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. అదే ఏడాది బాలకృష్ణతో కలిసి నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా తర్వాత నయన తార ఇక సినిమాలు చేయనని ప్రకటించింది. దీంతో ప్రభుదేవ, నయన తార పెళ్లి చేసుకుంటున్నారని, పెళ్లి తర్వాత నయన్ సినిమాలు చేయబోదని అనుకున్నారు. కానీ, ప్రభుదేవ మాజీ భార్య ఆరోపణలు నయన్‌ను బాగా కుంగదీశాయి. దీంతో ప్రభుదేవకు ఆమె బ్రేకప్ చెప్పేసింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో..: ప్రభుదేవతో బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు నయన్ మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. 2012లో తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణం వందే జగద్గురం’ సినిమాతో నయన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా రాణి’ సినిమా నయన్‌కు మాంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నయన్‌కు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు పెరిగాయి. 2015లో ‘నేను రౌడీనే’ సినిమా నయన్‌కు స్టార్‌డమ్‌ను మార్చేసింది. ఆ తర్వాత అత్యాచార బాధితురాలిగా ‘పుదియా నియమమ్’ (తెలుగులో ‘వాసుకి’) సినిమాలో నయన్ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. రజనీకాంత్, మమ్మూటీ నుంచి చిరంజీవి వరకు ప్రతి స్టార్ హీరో పక్కనా నయన్ నటించింది.
ఏడేళ్లుగా విఘ్నేషే అన్నీ..: ‘నేను రౌడినే’ సినిమా తర్వాత విఘ్నేష్ శివన్ నయన్‌కు సపోర్టుగా ఉన్నాడు. అతడిలోని పాజిటివ్ థింకింగ్‌కు నయన్ ఫిదా అయ్యింది. అలా వారు తెలియకుండానే ప్రేమలో పడిపోయారు. రూమర్స్ చక్కర్లు కొడుతున్న సమయంలో వారిద్దరి మధ్య స్నేహమే ఉండేదట. అయితే, విఘ్నేష్ ఓ రోజు నయన్‌కు అసలు విషయం చెప్పేశాడట. నువ్వులేని జీవితం ఊహించుకోవడం కష్టంగా ఉందనే మాటకు నయన్ భావోద్వేగానికి గురైందట. వెంటనే అతడి లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసిందట. అప్పటి నుంచి నయన్ బాధ్యతలన్నీ విఘ్నేష్ చూసుకుంటున్నాడు.
Also Read: పెళ్లి తర్వాత నటనకు నయనతార దూరం? కాబోయే అత్తగారు పెట్టిన కండిషన్ కారణంగా..
ప్రేమకు గుర్తుగా నిర్మాణ సంస్థ: నయన్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేవు. అవన్నీ విఘ్నేషే చూసుకుంటున్నాడు. నయన్ అప్‌డేట్స్, సినిమా ప్రమోషన్లనీ విఘ్నేషే చూసుకుంటున్నాడు. పైగా, ఆమె గతాన్ని చూడకుండా ఆమె మనసును మాత్రమే అర్థం చేసుకుని మెలగడం విఘ్నేష్‌కే చెల్లుతుంది. తనని చంటిపాపలా చూసుకుంటున్న విఘ్నేష్ జీవిత భాగస్వామిగా లభించడం నయన్ అదృష్టమనే చెప్పుకోవాలి. మొత్తానికి ‘నేనూ రౌడీనే’ కథ వారి ప్రేమకు పునాది వేసింది. అందుకే, విఘ్నేష్-నయన్‌లు తన సినీ నిర్మాణ సంస్థకు ‘రౌడీ పిక్చర్స్’ అని పేరు పెట్టుకున్నారు. నయన్, సమంత నటించిన ‘కణ్మణి రాంబో కఠిజా’ సినిమా కూడా ఈ బ్యానర్‌తోనే తెరకెక్కించారు.
Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?
View this post on Instagram