అన్వేషించండి

Vignesh Shivan Nayanthara Wedding: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయనతార - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులు ఏవి?

Vikki Nayan Marriage: తెలుగు చలన చిత్ర పరిశ్రమను నయనతార పక్కన పెట్టిందా? తెలుగు సినీ ప్రముఖులను తన పెళ్ళికి ఆహ్వానించడం లేదా?

నయనతార పెళ్లి (Nayanthara Marriage) హడావిడి మొదలైంది. తమిళ దర్శకుడు, నయన్‌కు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ పెళ్లి వేదికను తిరుపతి నుంచి ఎందుకు మహాబలిపురానికి మార్చాల్సి వచ్చిందో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ వివాహానికి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామని తెలిపారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను స్వయంగా కలిసిన విఘ్నేష్ శివన్, నయనతార... పెళ్లికి వచ్చి తమను ఆశీర్వదించ వలసిందిగా కోరారు. తమిళ సినీ ప్రముఖులు కొంత మందికి శుభలేఖలు అందజేశారు. మరి, తెలుగు సినిమా ప్రముఖుల సంగతి ఏంటి? 

నయనతార పెళ్లికి లేదా రిసెప్షన్‌కు హాజరు కానున్న సినీ ప్రముఖుల జాబితాలో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి వంటి తమిళ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు నుంచి చిరంజీవి పేరు తప్ప మరొకరి పేరు వినిపించడం లేదు. చిరంజీవికి సైతం డిజిటల్ ఇన్విటేషన్ పంపించి... ఫోనులో ఆహ్వానించారని టాక్. 

నయనతారకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోల పక్కన అవకాశాలు ఇచ్చింది. నటిగా నయనతారకు పేరు రావడానికి సీత పాత్ర రావడం ఒక కారణం. బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' ఆమెకు గౌరవం తెచ్చింది. తమిళంతో పోలిస్తే... తెలుగులో ఆమె అత్యధిక పారితోషికం అందుకుంది. అటువంటి ఇండస్ట్రీని, ప్రముఖులను ఆమె విస్మరించడం బాలేదని టాలీవుడ్ టాక్.

Also Read: Vignesh Shivan Nayanthara Wedding Card: నయనతార పెళ్లి శుభలేఖ చూశారా? వైరల్ వెడ్డింగ్ కార్డ్

ప్రస్తుతానికి అయితే నయనతార పెళ్లికి ఆహ్వానం అందిన తెలుగు ప్రముఖులను వేళ్ళ మీద లెక్క పెట్టడం కష్టం అని ఇండస్ట్రీ గుసగుస. పెళ్లి తర్వాత ఫొటోలు బయటకు వస్తే తప్ప... టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్లారనే విషయంలో స్పష్టత రాదు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కూడా తెలుగు సినిమా ప్రముఖులు ఎవరినీ ఆహ్వానించలేదు. 

Also Read: నయనతారను తిరుపతిలో ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పిన విఘ్నేష్ శివన్

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget