అన్వేషించండి

Nayanthara: ఈ చిన్నారి ‘Two Two Two’ డ్యాన్స్ చూసి.. నయనతార బాయ్‌ఫ్రెండ్ ఫిదా, మీకూ నచ్చేస్తుంది!

సంగీత దర్శకుడు అనిరుద్ స్వరపరిచిన ‘టు టు సాంగ్’కు ఈ చిన్నారి చేసిన డ్యాన్స్ చూసి నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఆశ్చర్యపోయాడు.

విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కాదు వాకులా రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) తమిళ సినిమాలో ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుద్ ఇటీవల విడుదల చేసిన వీడియో సాంగ్ తమిళనాడులో వైరల్‌గా ట్రెండవ్వుతోంది. ‘టు టు టు’ (Two Two Two) సాంగ్ ఛాలెంజ్ నేపథ్యంలో తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆ పాటకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.

తాజాగా ఓ చిన్నారి ఈ పాటను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్, అందులో ఆమె అభినయాన్ని చూసి.. నయన తార బాయ్ ఫ్రెండ్, ఆ చిత్ర నిర్మాత విఘ్నేష్ శివన్ ఫిదా అయ్యాడు. సోనీ మ్యూజిక్ సౌత్ సంస్థ ట్వీట్ చేసిన ఆ వీడియోను రీట్వీట్ చేశాడు. ‘‘ఎంత గొప్పగా చేశావు లిటిల్ యాంజిల్’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందులోని చిన్నారి మూడు పాత్రల్లో భలే నటించింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. 

‘టు టు టు’ సాంగ్‌కు చిన్నారి డ్యాన్స్:

విజయ్ సేతుపతి, నయన తార, సమంతా.. ఈ ముగ్గురికి దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మరి, ఈ ముగ్గురు ఒక చోటే కలిస్తే.. అభిమానులకు కనువిందే. ఈ ముగ్గురు ఇటీవల పబ్లిక్ ప్లేస్‌లో ఒకే బస్సులో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ కనిపించారు. పద్ధతిగా చీర కట్టుకున్న నయన్, సమంతలతో సేతుపతి సైతం ఫుట్ బోర్డు‌పై నిలబడ్డాడు. ఈ వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘కాదు వాకులా రెండు కాదల్’ చిత్రం ‘అన్యోన్యమైన’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఒకప్పుడు అమల, కమలహాసన్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ పాడే ‘‘పరువాలు కనివిని ఎరుగని.. చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్లలో’’ పాటను రిక్రేయేట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, అందులో కమల హాసన్.. అమలతో మాత్రమే కనిపిస్తారు. ఇందులో విజయ్ సేతుపతి నయనతార, సమంతలతో డ్యూయెట్ పాడతారని తెలిసింది.

‘టు టు టు’ ఒరిజనల్ సాంగ్:

ఈ పాటను గ్రీన్ మ్యాట్‌లోనే కానిద్దమని భావించినా.. సహజత్వం కోసం పబ్లిక్ ప్లేసులో షూటింగ్ చేయక తప్పలేదట. దీంతో.. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన పాత్రల లుక్స్ లీకవ్వడంతో ఇప్పుడు విఘ్నేష్ లబోదిబో అంటున్నాడు. ఏది ఏమైనా.. చీరకట్టులో ఇద్దరూ భలే బాగున్నారంటూ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు ముగింపుకు వచ్చింది. సమంతా కూడా మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకొనేందుకు తమిళనాడు వెళ్లింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పుదుచ్చేరీ పరిసరాల్లోనే జరుగుతోంది.  

Also Read: రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్ ఈ నెల‌లోనే….చెర్రీ రెమ్యున‌రేష‌న్ పై హాట్ డిస్కషన్
Also Read: నిర్మాత, జూ.ఎన్టీఆర్‌ పీఆర్వో మహేశ్‌ కోనేరు మృతి
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget