(Source: ECI/ABP News/ABP Majha)
MAA Elections 2021: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు
'మా' ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వేడి మరింత రాజుకుందే కానీ చల్లారలేదు. 'మా'లో జరుగుతున్న హడావుడిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన అభిప్రాయం చెప్పారు..
రాజకీయ రణరంగాన్ని తలపించిన 'మా' ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ప్రస్తుతం రాజీనామాల హడావుడి నడుస్తుండడంతో మరింత రాజుకుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏం జరుగుతోందో , ఏం జరుగుతుందో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. దీనికెక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదుకానీ గెలిచిన వారు అంతా సమానం అంటుంటే ఓడిన వారు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంత అలజడి మంచిదికాదని అభిప్రాయపడ్డారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆయన 'సినిమా పెద్దలు అందరూ కలిసి మా అధ్యక్షునిగా ఎవరో ఒకర్ని ఏకగ్రీవంగాఎన్నుకుని ఉంటే బాగుండేది. అదే మంచి పద్ధతి కూడా అన్నారు. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందన్నారు రాఘవేంద్రరావు. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
Also Read: 'పాన్ మసాలా' వద్దన్న అమితాబ్.. ఇప్పుడు అందరి చూపూ మహేశ్ బాబు వైపే..
నువ్వా నేనా అంటూ జరిగిన మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేనంత హడావుడి జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో 'మా' సభ్యులు పందెంకోళ్లను తలపించారు. పోలింగ్ , కౌంటింగ్ హడావుడి కూడా ఓ రేంజ్ లో సాగింది. అసోసియేషన్లో వెయ్యిమంది కూడా లేకపోయినా రాష్ట్ర ఎన్నికలను తలపించాయి. ఎట్టకేలకు ఎన్నికలు పూర్తై విష్ణు అధ్యక్షుడిగా గెలవడంతో అంతా అయిపోయిందనుకున్నారు. ఎన్నికల ముందు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టు పరిస్థితి మారింది. మా అధ్యక్ష పదివికి మంచు విష్ణు గెలుపొందిన కాసేపటికే మెగా బ్రదర్ నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్" ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం అన్నారు. ఇలాంటి అజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు..‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను అంటూ ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే సెగ మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ఇలాంటి సమయంలో రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది..ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలంతా కలసి 'మా' లో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి