Natti Kumar: పెద్ద హీరోల వల్లే తెలుగు సినిమాకు ఈ దుస్థితి: ‘ఏబీపీ దేశం’ ఇంటర్వ్యూలో నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్
Natti Kumar: ప్రొడ్యూసర్ నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పెద్ద హీరోల వల్లే తెలుగు సినిమా థియేటర్లు మూతపడ్డాయని అన్నారు. థియేటర్లు మూసేయడాన్ని తను సమర్థించడం లేదని చెప్పారు.
Natti Kumar on Single Screen Theatres Close: తెలంగాణ వ్యాప్తంగా మే 17 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్న విషయం తెలిసిందే. సినిమాలు లేక నష్టాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మూసేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయం సమంజసం కాదని, ఎవరినీ సంప్రదించకుండా ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారని అన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్. పెద్ద హీరోల వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని అన్నారు ఆయన. ABP Desamకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయాలు చెప్పారు. పెద్ద హీరోలు కచ్చితంగా ఏడాదికి రెండు సినిమాలు తియ్యాల్సిందే అని అన్నారు. థియేటర్ల ఓనర్లని కచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పెద్ద హీరోల వల్లే..
"ఎస్ పెద్ద హీరోల వల్ల, ప్రొడక్షన్ రాకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇవన్నీ ఎక్కడ మాట్లాడాలి? మన కాంపౌండ్ లో మనం మాట్లాడుకోవాలి. మీరు ఒక్కరు డెసిషన్ తీసుకోకూడదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. యూనిట్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. 17వ తారీఖు ఒక్క థియేటర్ ఓపెన్ అవ్వకపోతే మీ అసోసియేషన్ కి మద్దతు ఇస్తాను. అదే.. ఒక్క థియేటర్ అయినా ఓపెన్ అయితే మీ అసోసియేషన్ మూసేసుకుంటారా?" అని ఛాలెంజ్ చేశారు నట్టికుమార్.
ఛాంబర్స్ ని సంప్రదించాలి..
"ఛాంబర్స్ ఉన్నాయి కదా? 1941లో తెలంగాణ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్. 1951లో తెలుగు ఫిలిమ్ అసోసియేషన్ ఏర్పడింది. ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి. ఆషామాషీగా సినిమాలు తీసి రిలీజ్ చేయడం కాదు ఇది. నష్టాన్ని భరిస్తున్నాం. నాలుగు నెలలు నడిపితే నష్టాలు లేనిది. పది రోజుల్లో ఏమొస్తుంది. కంటెంట్ ఓనర్ ని నేను. నాకు చెప్పాలి కదా. 15వ తారీఖు అనౌన్స్ చేశారు. 17వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. ఆన్ లైన్ లో పెట్టాం. సినిమా టికెట్లు ఇచ్చేశారు. ఇప్పుడు ఎలా బంద్ చేస్తారు? ప్రేక్షకులు రారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చెప్పకుండా మానేయడానికి లేదు. ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. సినిమా థియేటర్స్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎంప్లాయిస్ పరిస్థితి ఏంటి? అవ్వన్నీ ఆలోంచాలి కదా. అందరినీ ఆదుకుంటాం. రేపు 25 తెలంగాణ, ఏపీ, రాయలసీమ అందరితో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటాం" అని అన్నారు నట్టికుమార్.
పెద్ద హీరోల సినిమాలు లేవు..
వేసవి, సంక్రాంతి, దసరా సెలవులు కావడంతో.. సినిమాలు రీలీజ్ చేస్తుంటారు. అప్పుడు సెలవులు, పండగలు కారణంగా ఫ్యామిలీతో కలిసి సినిమాలకు వెళ్తుంటారు. అయితే, ఈసారి వేసవికి ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. 'ఫ్యామిలీ స్టార్', 'టిల్లు స్కేర్', 'ఓం భీమ్ భుష్', 'గీతాంజలి మళ్లీ వచ్చింది' లాంటి సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. నిజానికి చిన్న హీరోల సినిమాలు బాగున్నాయి అనే టాక్ వస్తేనే జనాలు థియేటర్లకి వెళ్తారు. ఒక్కోసారి బాగున్నా కూడా ఓటీటీల్లో చూసేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారు చాలామంది. కానీ పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే వస్తారు. దీంతో థియేటర్లకు కొంతమేర బాగుండేది. కానీ, ఈ సారి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం అంటున్నారు థియేటర్స్ ఓనర్లు.
Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ - NTR31 టైటిల్ ఇదేనట!