అన్వేషించండి
Ante Sundaraniki Movie Trailer: 'అంటే సుందరానికి' ట్రైలర్ వచ్చేసింది - ఫుల్ ఫన్ రైడ్
నాని నటిస్తోన్న 'అంటే సుందరానికి' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'అంటే సుందరానికి' ట్రైలర్ వచ్చేసింది
'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటినుంచి 'ఆవకాయ్ సీజన్'లో తమ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ చెబుతూ వస్తోంది. ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన ఈ టీమ్ ఫైనల్ గా జూన్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
'బ్రోచేవారేవరురా', 'మెంటల్ మదిలో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 40 సెకన్ల ఈ ట్రైలర్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించని తెలిసిన హీరో, హీరోయిన్ ఆ తరువాత ఏం చేశారనేదే సినిమా. ఇవే సన్నివేశాలను ట్రైలర్ లో కూడా చూపించారు.
ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో నాని 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలో 'ఆదదే సుందర', మలయాళంలో 'ఆహా సుందర' టైటిల్స్‌తో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















