అన్వేషించండి

Balakrishna ‘Unstoppable’: బాలయ్య మంచి మనసు.. ‘ఆహా’ టాక్ షో పారితోషకంతో ఏం చేయనున్నారంటే..

నందమూరి నటసింహం రూటే సేపరేట్. ఇప్పటి వరకూ ఎంతోమంది స్టార్ హీరోలు ఎన్నో షోస్ హోస్టే చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు బాలకృష్ణ…


బాలీవుడ్-టాలీవుడ్-కోలీవుడ్ ఇలా తేడాలేకుండా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు వెండితెరతో పాటూ బుల్లితెరపై కూడా మెరుస్తున్నారు. టాక్ షోస్ కి, రియాల్టీ షోస్ సహా పలు కార్యక్రమాలకు హోస్టులుగా మెప్పిస్తున్నారు.  నాగార్జున, యంగ్ టైగర్, రానా, అలీ, సమంత, ప్రియమణి, రోజా, నాగబాబు బుల్లితెరపై అలరిస్తుండగా గతంలో మెప్పించిన జాబితాలో చిరంజీవి, నాని కూడా ఉన్నారు. ఇందుకోసం  భారీ పారితోషికంతో పాటు మంచి ఫేమ్ కూడా వస్తోంది. అందుకే మరికొందరు స్టార్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని పేరంటే మాత్రం నందమూరి బాలకృష్ణ. ఊహించని ట్రీట్ ఇచ్చారంటూ అభిమానులు ఆనందానికి హద్దే లేదు. అయితే నటసింహం ఈ టాక్ షో అంగీకరించడం వెనుక ప్రధానం కారణం వేరే ఉందంటున్నారు. 

ఆహా లో ' అన్ స్టాపబుల్ టాక్ షో' ద్వారా వచ్చిన పారితోషికాన్ని చారిటీకి ఉపయోగించనున్నారట బాలకృష్ణ. బసవతారకం  క్యాన్సర్ ఆసుపత్రితో పాటు పలు సేవా కార్యక్రమాలకు ఆ డబ్బును వినియోగించేలా ప్లాన్ చేశారట. మొదటి సీజన్ కు గాను బాలయ్య ఏకంగా నాలుగు కోట్ల కు పైనే పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ  మొత్తం ఛారిటీకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో బాలయ్య భోళాశంకరుడని మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు అభిమానులు. తన మంచితనం గురించి చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏముందంటున్నారు. ఆహాలో 'అన్ స్టాపబుల్ టాక్ షో'  దీపావళి సందర్బంగా స్ట్రీమింగ్ కానుంది.  ప్రముఖ స్టార్స్ ను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నారు. హీరోలు, హీరోయిన్స్, దర్శకులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య లాంటి స్టార్ హీరో హోస్ట్ గా వ్యవహరించబోతుండడంతో ఈ  టాక్ షో పై ఆసక్తి పెరిగింది.  
Also Read: కిలిమంజారో అధిరోహించిన నివేదా థామస్
అయితే బాలయ్య షో కు మొదటి గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు వస్తారని టాక్.  బాలయ్య- మోహన్ బాబు  ఆప్యాయంగా సోదర అంటూ పిలుచుకుంటారు. ఇక బాలయ్య మోహన్ బాబును ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. అలాగే ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు అన్నది చూడాలి.  ఈ షోకు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఒకెత్తు అయితే.. తన షో మాత్రం మరో ఎత్తు అంటున్నాడు బాలయ్య కూడా. తాను అంత ఈజీగా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకోలేదని  కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. మరోవైపు బాలయ్య-బోయపాటి లేటెస్ట్ మూవీ 'అఖండ' సెట్స్ పై ఉంది. 
Also Read:  'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read:  ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ హంగామా.. ఇవిగో వీడియోలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget