Naa Saami Ranga Trailer: ‘నా సామిరంగ’ ట్రైలర్ - కిష్టయ్యను వెయ్యాలంటే సావుకు ఎదురెల్లాలి, నాగ్ ఊరమాస్ రచ్చ
Naa Saami Ranga Trailer: నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’ ట్రైలర్ విడుదల అయ్యింది. యాక్షన్, ఎమోషన్స్, కామెడీతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
Naa Saami Ranga Trailer Out: సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనింగ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.
‘నా సామిరంగ’ అనిపిస్తున్న ట్రైలర్
‘నా సామిరంగ’ ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. ఎమోషన్, యాక్షన్, కామెడీతో అలరిస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సంక్రాంతి సంబురం అంతా ఈ సినిమాలోనే కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. హీరోయిన్ తో సరసాలు, జాతరలో కత్తితో హీరో సృష్టించే రక్తపాతం, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ, విలన్ గ్యాంగ్స్ పవర్ ఫుల్ డైలాగులు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. మొత్తంగా నాగార్జునను ఈ సినిమాలో ఊరమాస్ కిష్టయ్యగా చూపించారు దర్శకుడు. ఈ ట్రైటర్ చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.
సినిమాపై భారీ అంచనాలను పెంచిన ట్రైలర్
కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు అనే అల్లరి నరేష్ వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. జాతరలో రౌడీలను చితక బాదుతూ హీరో నాగార్జున ఎంట్రీ ఇస్తారు. అంజి పాత్రలో అల్లరి నరేష్ అల్లరితో ఆకట్టుకుంటాడు. ఇక కారులో అలనాటి మేటి నటి సావిత్రిలా కారులో నుంచి దిగుతుంది అందాల తార అషిక రంగనాథ్. తెల్లటి పట్టు చీరలో నల్లటి కళ్లజోడు, నుదుటిన బొట్టుతో ఆకట్టుకుంటుంది. ఆమెను చూసి రాజ్ తరుణ్ ఎవరన్నయ్యా? అంటాడు. మన కిష్ణయ్య లవ్స్ అంటాడు అల్లరి నరేష్. కిట్టయ్యకు నరకడం తెలుస్తది గానీ, సరసం ఎట్టా తెలుస్తది? అంటాడు రాజ్.
ఇక అషికాతో, ఇంత అందంగా తయారై వచ్చావ్ అంటాడు నాగార్జున. సినిమా చూద్దామని వచ్చాను అంటుంది. నువ్విట్టా సినిమాకు వస్తే ఉంటాది నా సామిరంగ అంటాడు. అషికాతో నాగార్జున రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత నాగార్జునలోని మాస్ ఎలివేషన్ ను చూపించారు. పాతికేళ్ల క్రితం ప్రభలు వెళ్లకపోతే వరదలు వచ్చాయని మా ఊళ్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ పాటి కిష్టయ్య వచ్చాడని మీ ఊళ్ల చెప్పుకుంటార్రా అంటూ జాతరలో నాగార్జున చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంటుంది. కిష్టయ్యను వెయ్యాలంటే సావుకు ఎదురెల్లాలి అంటూ విలన్ గ్యాంగ్ చెప్పునే డైలాగ్ అదుర్స్ అనిపిస్తుంది. సాయంత్రం ప్రభల తీర్థం అయ్యాక పోయి, తెగిన తలలెన్ని ఉన్నాయో లెక్కెట్టుకో అని పోలీసు ముందు గర్వంగా హీరోయిన్ చెప్పే మాట నాగార్జున రేంజిని చూపిస్తుంది. విలన్ కొలిమిలో నుంచి తీసి విసిరిన గడ్డపారతో బీడి కాల్చుకోవడం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది.
నాగార్జున ఆశలన్నీ ఈ సినిమా మీదే!
ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున, తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నారు.
Read Also: కథతో కబడ్డీ ఆడుకున్నాడు, ‘హాయ్ నాన్న’ దర్శకుడిపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు