అన్వేషించండి

Paruchuri Gopala Krishna: కథతో కబడ్డీ ఆడుకున్నాడు, ‘హాయ్‌ నాన్న’ దర్శకుడిపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు

Paruchuri Gopala Krishna: నాని రీసెంట్ మూవీ ‘హాయ్ నాన్న’పై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథతో దర్శకుడు శౌర్యువ్ కబడ్డీ ఆడుకున్నాడని వెల్లడించారు.

Paruchuri Gopala Krishna About Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’  బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. ‘దసరా’ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు గ్రాండ్ సక్సెస్ కావడంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘హాయ్ నాన్న’ హిట్ తర్వాత చిత్రబృందం సైతం ఆనందంలో మునిగిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు ఈ సినిమా నిడివి కాస్త తగ్గించి ఉంటే ఇంకా బావుండేదని అభిప్రాయపడ్డారు.    

సినిమా కథను నడిపించిన విధానం అద్భుతం

హీరో నాని కథలను ఎంచుకునే విధానం చాలా బాగుంటుందని పరుచూరి పొడగ్తలు గుప్పించారు. “నాని వైవిధ్యమైన కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ముందుంటాడు. ‘హాయ్ నాన్ని’ చక్కటి ప్రేమకథ. పిల్లలను వద్దు అనుకునే భార్య, భర్త ఒప్పించాక ఏం జరిగిందన్నది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడానికి మెయిన్ కారణం స్క్రీన్‌ ప్లే. ప్రేక్షకుల ఊహకు అందకుండా సినిమా తీయడం ఒక కళ. శౌర్యువ్ అదే పాయింట్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదం కారణంగా గతం మర్చిపోయిన భార్యకు భర్త మళ్లీ ఎలా గుర్తు చేశాడు అనేది బాగా చూపించారు. ఇందులో పెళ్లి సన్నివేశాన్ని గుండెలకు హత్తుకునేలా తీశారు.  తొలి భాగంలో భార్య భర్తల బంధాన్ని, ఆ తర్వాత వాళ్ల పాప బతుకుతుందా? లేదా? అనే పాయింట్ తో సినిమా కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు కూతురు సెంటిమెంట్ ను యాడ్ చేసి నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది” అన్నారు.

నిడివి తగ్గిస్తే ఇంకా బాగుండేది!

సినిమా ఏదైనా కథలో బలం ఉండాలని చెప్పారు పరుచూరి. “సినిమాకు కథ అనేది చాలా ముఖ్యం. కథలో పస లేకపోతే ఎన్ని రోజులు కష్టపడి సినిమా తీసినా థియేటర్లకు ప్రేక్షకులు రారు. వారం రోజులు కూడా సినిమా ఆడదు. ఈ సినిమాకు కథే ప్లస్. ఇక ఈ సినిమాలో రెండు ఫైట్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. డైలాగులు కూడా చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా రాశారు. ఈ సినిమాతో శౌర్యువ్ ప్రేక్షకుల మనసును కదిలించాడు. బతకదు అనుకున్న పాపను తండ్రి కాపాడుకునే తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా డ్యూరేషన్ కాస్త ఎక్కువ అయింది అనిపించింది. చివరి 10 నిమిషాల పాటు కట్ చేస్తే ఇంకా బాగుండేది. సినిమా క్రిస్ప్ గా ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. సీనియర్ రచయితగా ఇది నా అభిప్రాయం మాత్రమే” అని ఆయన వెల్లడించారు.  

Read Also: మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget