Animal Movie: మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్
Animal Movie: ‘యానిమల్’ మూవీపై ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో ప్రమాదకరమన్నారు. ఆయన వ్యాఖ్యలకు చిత్రబృందం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Animal Makers Reply To Javed Akhtar: రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. గత డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, అదే స్థాయిలో విమర్శలపాలైంది. ఆర్జీవీ లాంటి దర్శకులు సినిమా చాలా బాగుందని ప్రశంసించినా, కొందరు ప్రముఖులు సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసేలా ఉందని విమర్శించారు. ఈ సినిమాపై పార్లమెంట్ లోనూ చర్చజరిగింది. ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరమని సభ్యులు అభిప్రాయపడ్డారు.
‘యానిమల్’ మూవీపై జావేద్ అక్తర్ తీవ్ర విమర్శలు
తాజాగా ‘యానిమల్’ మూవీపై ప్రముఖ సినీ రచయిత జావేద్ ఆక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలను హిట్ చేసిన ప్రేక్షకులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “ఓ మూవీలో ఓ పురుషుడు, ఓ స్త్రీని తన షూ నాకాలంటాడు. అలా చేస్తేనే హీరో తన ప్రేమ ఉందని భావిస్తాడు. అదే సమయంలో మహిళలను చెంప మీద కొట్టడం కరెక్టే అని చెప్తారు. మరో సందర్భంలో మహిళపై బూతులతో విరుచుకుపడతాడు. ఇలాంటి సన్నివేశాలు ఉన్న ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదు. ఈ రకమైన సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరం” అని జావేద్ అభిప్రాయపడ్డాడు.
జావేద్ విమర్శలకు ‘యానిమల్’ మేకర్స్ కౌంటర్
జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్’ చిత్రబృందం స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఆయనపై విమర్శలు చేసింది. “జోయా, రణబీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోవాలి. లేదంటే మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక మహిళను ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అన్నా ఫర్వాలేదు. కానీ, స్త్రీని అలా అంటే మీ దృష్టిలో తప్పా? లింగ బేధమనే పాలిటిక్స్ లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసింది. అతడికి అబద్దం చెప్పింది. అందుకే ప్రియుడు తన షూ నాకమన్నాడు” అని వివరణ ఇచ్చింది.
‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తికి చెప్పుతాడు. అటు షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన ‘కబీర్ సింగ్’ చిత్రంలో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్‌లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. జావేద్ అక్తర్ తాజాగా ఈ రెండు సినిమాలను టార్గెట్ చేసిన మాట్లాడారు. తాజాగా ‘యానిమల్’ సక్సెస్‌ను చిత్రబృందం ముంబైలో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.