Bangarraju Trailer: వాసివాడి తస్సాదియ్యా... 'బంగార్రాజు' ట్రైలర్ అదిరిందయ్యా!

కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 

FOLLOW US: 

కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్ ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 'పండగ లాంటి సినిమా' అని మొదటి నుంచి సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ట్రైలర్ అంతా ఆ పండగ వాతావరణం కనిపించింది.
'బంగార్రాజు బావగారు... చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు' అంటూ మీనాక్షీ దీక్షిత్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. స్వర్గంలో అందమైన భామలతో సోగ్గాడిగా నాగార్జున కబడ్డీ ఆడటంతో ట్రైలర్ మొదలు అయ్యింది. ఆ తర్వాత నాగార్జున మనవడిగా నాగచైతన్యను పరిచయం చేశారు. కొత్త సోగ్గాడిగా చైతన్య సూపర్ చేశాడు. 'మాట్లాడుకోవడానికి అయితే అమ్మాయిని... కొట్టేసుకోవడానికి అయితే మగాడిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావంట కదరా' అని చైతన్య చెప్పే డైలాగ్ బావుంది. ఫైట్స్ కూడా సూపర్. యమ ధర్మరాజులా నాగబాబు నటించారు. 'మావిడి తోటలోకి వెళ్లి మాట్లాడుకుందామా?' అని నాగచైతన్యను కృతి శెట్టి అడగటం, అంతకు ముందు వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి.

నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ... నాగ చైతన్యకు జోడీగా కృతీ శెట్టి నటించిన ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ప్రత్యేక గీతం చేసిన సంగతి తెలిసిందే. మీనాక్షీ దీక్షిత్, వేదిక, దక్షా నగార్కర్, సిమ్రత్ కౌర్, దర్శనా బానిక్... మరో ఐదుగురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రలు చేశారు. 
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
Also Read: పీరియ‌డ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్‌
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...
Also Read: పవన్ కల్యాణ్‌తో వ‌న్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Ramyakrishna Krithi Shetty Naga Chaitanya nagarjuna నాగార్జున నాగచైతన్య Bangarraju movie బంగార్రాజు bangarraju trailer Bangarraju Trailer Review

సంబంధిత కథనాలు

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

First Day First Show: 'జాతి రత్నాలు' కేవీ అనుదీప్ కథతో...

First Day First Show: 'జాతి రత్నాలు' కేవీ అనుదీప్ కథతో...

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా? 

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా? 

VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?

VD11 - Kushi First Look:  విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !