News
News
X

Laal Singh Chaddha: బోడి బాలరాజుగా నాగచైతన్య మేకోవర్ - వీడియో షేర్ చేసిన 'లాల్ సింగ్ చద్దా' టీమ్!

'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నాగచైతన్య లుక్ అండ్ షూటింగ్ సమయంలో అతడి అనుభవాలను చూపించారు.

FOLLOW US: 

ఆమీర్ ఖాన్ హీరోగా, యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే రిలీజ్ కావాల్సింది కానీ అనివార్య కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ఏప్రిల్ లో కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ అప్పుడు కూడా రాలేదు. ఫైనల్ గా ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమాలో నాగచైతన్య మేకోవర్ కి సంబంధించి ఓ వీడియోను షేర్ చేశారు. 

ఇందులో నాగచైతన్య లుక్ అండ్ షూటింగ్ సమయంలో అతడి అనుభవాలను చూపించారు. ఈ సినిమాలో చైతు.. బోడి బాలరాజుగా కనిపించబోతున్నారు. ముందుగా బాల అనే పేరుతో క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. పేరుకి ముందు వెనుక ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు.. ఏపీలో బోడిపాలెం అనే ఊరులో అదే ఇంటి పేరుతో చాలా మంది ఉంటారని తెలుసుకొని దాన్నే క్యారెక్టర్ ఇనీషియల్ గా చేసినట్లు చైతు చెప్పారు. అలానే సినిమాలో తన లుక్ కి రిఫరెన్స్ తన గ్రాండ్ ఫాదర్ ఏఎన్నార్ అని చెప్పారు. ఇంకా వీడియోలో చాలా విషయాలే పంచుకున్నారు చైతు. అవేంటో కింద వీడియోలో చూసి తెలుసుకోండి!

ఇక ఈ సినిమా టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్‌'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్‌' (2017) తీసిన అద్వైత్‌ చందన్‌ ఈ హిందీ వెర్షన్‌ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాకు ఎరిక్‌ రోత్‌, రచయిత అతుల్‌ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు.

Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

Published at : 29 Jul 2022 07:03 PM (IST) Tags: Naga Chaitanya Laal Singh Chaddha Naga Chaitanya as balaraju Laal Singh Chaddha movie

సంబంధిత కథనాలు

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

టాప్ స్టోరీస్

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల