Bangarraju Song: ‘కొత్తగా నాకెమయ్యిందో... వింతగా ఏదో మొదలయ్యిందో...’ ప్రేమపాటతో సిధ్ శ్రీరామ్ మళ్లీ మాయ చేశాడుగా
పాటలు హిట్ కొడితే... దాదాపు సినిమా సగం హిట్ కొట్టినట్టే. బంగార్రాజు సినిమాలోని ప్రేమ పాట హిట్ కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమాలో ప్రధాన హీరో నాగార్జున అయినా, నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. ఇక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన కృతిశెట్టి కనిపించనున్నారు. తాజాగా చై, కృతి జంటపై చిత్రీకరించిన ఓ ప్రేమ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ‘కొత్తగా నాకెమయ్యిందో.. వింతగా ఏదో మొదలయ్యిందో...’ అంటూ మొదలై ‘నాకోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేశావా నువ్వు’ అంటూ సాగుతుంది ఈ పాట. ప్రేమికుల కోసమే ప్రత్యేకంగా రాసినట్టు ఉంటుంది సాంగ్. ఈ పాటను రాసింది బాలాజీ కాగా సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.
సోగ్గాడే చిన్నినాయనా తరహాలో ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. జీస్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మిగతా పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రావు రమేష్, చలపతిరావు, ఝాన్సీ కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తాతా మనవడిగా చేస్తున్నట్టు సమాచారం.
పెరిగిన బడ్జెట్...
ఈ సినిమా బడ్జెట్ 30 కోట్ల రూపాయలుగా అనుకున్నారట మేకర్స్. అందులోనే నటీనటుల రెమ్యునరేషన్ కూడా కలుపుకున్నారు. కానీ ఇప్పటికే 45 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయిపోయింది. దీంతో హిట్ అవుతుందో లేదో అన్న టెన్షన్ మొదలైందట మేకర్స్ లో.
Read Also: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Read Also: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Read Also: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
Read Also: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Read Also: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
Read Also: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















