X

Money Heist Part 5 Telugu Trailer: ‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్.. ప్రొఫెసర్ తన ముఠాను రక్షిస్తాడా? మరింత థ్రిల్‌గా దోపిడీ!

మనీ హైస్ట్.. వాల్యూమ్ 2లోని పార్ట్ 5 తెలుగు ట్రైలర్ వచ్చేసింది. ఇన్ని రోజులు పోలీసులకు కనిపించకుండా ఎత్తులు వేసిన ప్రొఫెసర్ నేరుగా బ్యాంక్ వద్దకు చేరుకోవడంతో ఆసక్తి నెలకొంది.

FOLLOW US: 

‘మనీ హైస్ట్’ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే ఈ వెబ్ సీరిస్ చివరి దశకు వచ్చేసింది. డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న వాల్యూమ్ 2, పార్ట్ 5 ఎపిసోడ్స్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీ సంస్థ రిలీజ్ చేసింది. దీపావళి సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. మొదటి పార్ట్ కంటే రక్తికట్టించే విధంగా రెండో పార్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రసారమైన పార్ట్ 2లో సైన్యం రంగంలోకి దిగడంతో ప్రొఫెసర్ టీమ్‌ కష్టాల్లో పడింది. తమ టీమ్ సభ్యులను కాపాడేందుకు టోక్యో ఆత్మహుతికి పాల్పడి సైనికులను చంపేసింది. మరోవైపు ప్రొఫెసర్ కూడా పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కాడు. అయితే, ఆమె ప్రసవంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రొఫెసర్‌కు సాయం చేస్తుందా? లేదా అతడిని పట్టుకుని మళ్లీ తన సత్తా చాటుతుందా అనేది చూడాలి. 


తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ప్రోఫెసర్ తన డెన్‌ను వీడి బ్యాంక్ వద్దకు వస్తున్నట్లు చూపించారు. రెడ్ కలర్ కారులో బ్యాంక్ వద్దకు చేరుకున్న ప్రొఫెసర్‌కు సైన్యం లోపలికి వెళ్లేందుకు దారి ఇవ్వడాన్ని ట్రైలర్‌లో చూడవచ్చు. అయితే, ప్రొఫెసర్ అక్కడికి చేరుకోడానికి ముందు పోలీస్ ఆఫీసర్‌తో పోరాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఛేజింగ్ సీన్లను ట్రైలర్‌లో చూపించారు. మరో వైపు ఓ మహిళ సైనికురాలు బ్యాంకులో ప్రొఫెసర్ టీమ్‌తో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.  


“మేము ఒక మిషన్‌ను పూర్తి చేయడానికి ఇక్కడకు వచ్చాం. ఈ దోపిడీకి ముగింపు పలకండి” అని సైన్యం వార్నింగ్ ఇస్తారు. పలెర్మో (రోడ్రిగో డి లా సెర్నా)  స్పందిస్తూ ‘‘మనం ఇక్కడి నుంచి బయట పడగలమా అని సందేహంగా ఉంది’’ అని అంటాడు. హెల్సింకి (డార్కో పెరిక్) “నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తావు. నువ్వు నాకు వాగ్దానం చేసావు’’ అని అంటాడు. బ్యాంక్‌లోకి ఎంట్రీ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తాడు? సైన్యానికి లొంగిపోతారా? లేదా మరో కొత్త ప్లాన్‌తో తప్పించుకుంటారా? అయితే, ప్రొఫెసర్‌ ఎత్తులు వేయడంలో దిట్ట.. ఈ సీజన్‌లో ఏ ప్లాన్ లేకుండా పోలీసులకు లొంగిపోతే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మరి, ఈ సీరిస్ ఇంతటితో ముగుస్తుందా.. కొనసాగుతుందా అనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.


‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్:  



Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు


Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు


Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Money Heist Trailer మనీ హీస్ట్ 5 ట్రైలర్ Money Heist Part 5 Telugu trailer Money Heist 5 Telugu trailer Money Heist Part 2 Telugu trailer మనీ హీస్ట్ తెలుగు ట్రైలర్

సంబంధిత కథనాలు

Allu Arjun Speech: భద్ర నేనే చేయాల్సింది.. ఎందుకు చేయలేదంటే? అఖండ ఈవెంట్‌లో బన్నీ ఇంట్రస్టింగ్ స్పీచ్!

Allu Arjun Speech: భద్ర నేనే చేయాల్సింది.. ఎందుకు చేయలేదంటే? అఖండ ఈవెంట్‌లో బన్నీ ఇంట్రస్టింగ్ స్పీచ్!

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Bigg Boss 5 Telugu: 'చెయ్ అతి చేయకు..' సిరికి డైలాగ్ కొట్టిన బాయ్ ఫ్రెండ్.. దీప్తిని చూసి ఫుల్ ఖుషీ అయిన షణ్ముఖ్..

Bigg Boss 5 Telugu: 'చెయ్ అతి చేయకు..' సిరికి డైలాగ్ కొట్టిన బాయ్ ఫ్రెండ్.. దీప్తిని చూసి ఫుల్ ఖుషీ అయిన షణ్ముఖ్..

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌

Omicron Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం... హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలెర్ట్..

Omicron Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం... హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలెర్ట్..

IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

Omicron Modi Review : ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !

Omicron Modi Review :  ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !