అన్వేషించండి
Advertisement
Kriti Sanon Mimi Release : లీకైన సినిమా.. చేసేదేమీ లేక..!
ఇప్పుడొక కొత్త సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే ఆన్ లైన్ లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్లో ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే చాలు.. మొదటి షో అయిన వెంటనే పైరసీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. పైరసీను అడ్డుకోవడానికి ఇండస్ట్రీ జనాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అడ్డుకోలేకపోతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి కూడా ఇంతే. దీనివలన నిర్మాతలంతా దారుణంగా నష్టపోతున్నారు. అయితే కొన్నిసార్లు కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన దారుణ ఉదంతాలు కూడా జరుగుతుంటాయి.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో ఇలానే జరిగింది. మరికొన్ని సినిమాలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడొక కొత్త సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే ఆన్ లైన్ లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా ఏంటంటే.. 'మిమి'. బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రదాహం పాత్ర పోషించిన సినిమా ఇది.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో '1 నేనొక్కడినే'. 'దోచేయ్' లాంటి సినిమాల్లో నటించింది. ఆ రెండూ ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఆమెకి వరుస అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో 'మిమి' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం ఆమె చాలానే కష్టపడింది. ఈ నెల 30న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావాల్సివుంది.
కానీ ఇంతలో ఈ సినిమా క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. ఇంటర్నెట్ లోకి ఓ సినిమా వచ్చిందంటే.. దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. మొబైల్స్ లో వైరల్ అయిపోతుంది. 'మిమి' సినిమా పరిస్థితి కూడా అంతే. పైరసీ వెర్షన్ ను తీయించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని ఇప్పటికే చాలా మంది షేర్ చేసేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ వాళ్లు వెంటనే రియాక్ట్ అయ్యి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 30న కాకుండా సోమవారం(జూలై 26) సాయంత్రమే ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేశారు. విడుదలకు నాలుగు రోజుల ముందే సినిమా ఇలా లీక్ అయిందంటే అది కచ్చితంగా చిత్రబృందంలోని వారి పనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. ఈ విషయంలో పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డబ్బుకి ఆశపడి ఒక ఫారెన్ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి చూసే మధ్యతరగతి అమ్మాయి కథే ఈ సినిమా.
అయితే ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న కృతిసనన్ కు ఈ సినిమా రిలీజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ లా మారింది. ఈ సినిమా చూసిన వారంతా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాలో కృతిసనన్, పంకజ్ త్రిపాఠిల పెర్ఫార్మన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion