Murali Mohan: కాలేజ్‌లో కృష్ణ, నేను ఏరా అని పిలుచుకొనేవాళ్లం, ఆయన హీరో అయిన తర్వాత ఓ సారి.. : మురళి మోహన్
సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మురళీ మోహన్.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, ఆయన గురించి మరెవరికీ తెలియని ఎన్నో విషయాలు వెల్లడించారు..
మురళీ మోహన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఇటు సినిమా.. అటు వ్యాపారం.. మరోవైపు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు విభిన్న రంగాల్లోనూ రాణించి అందరి చేత ప్రశంసలు పొందిన వ్యక్తి ఆయన. అందరితోనూ స్నేహభావంతో మెలిగే వ్యక్తి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి మురళీ మోహన్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటలు వింటే.. కృష్ణలా మరెవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది.
హీరోగా రాణించి.. నిర్మాతగా మారి..
తెలుగు సినిమా పరిశ్రమలో మురళీ మోహన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు వంటి హీరోలు తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్న వేళ, ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తక్కువ సమయంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే, మరోవైపు నిర్మాతగా మారారు. ఎన్నో అద్బుతమైన సినిమాలు నిర్మించారు. ఇటు హీరోగా, అటు నిర్మాతగానూ మంచి పేరు సంపాదించుకున్నారు.
కృష్ణ నా క్లాస్‌మేట్
ఇక సూపర్ స్టార్ కృష్ణతో మురళీ మోహన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. వయసులో కృష్ణ తనకంటే చిన్నవాడు అని చెప్పారు. కృష్ణ, తాను క్లాస్ మేట్స్ అని వివరించారు. కాలేజీ రోజుల్లో ఇద్దరం ఏరా అంటే ఏరా అనుకునే వాళ్లం అన్నారు. కాలేజీ తర్వాత కృష్ణ సినిమా రంగంలోకి అడుగు పెట్టారని చెప్పారని చెప్పారు. ఆయన ‘తేనె మనసులు’ సినిమాతో హీరోగా మారిట్లు వెల్లడించారు. తక్కువ సమయంలోనే కృష్ణ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు వెల్లడించారు. నెమ్మదిగా సూపర్ స్టార్ గా ఎదిగారన్నారు. తాను వ్యాపార రంగంలోకి వెళ్లి.. బాగా స్థిరపడ్డాక సినిమాల్లోకి వచ్చినట్లు వివరించారు.
నేను అలా పిలిస్తే కోపం వచ్చేది
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టన తర్వాత.. కొన్ని సినిమాల్లో హీరోగా నటించినట్లు చెప్పారు మురళీ మోహన్. వాటిలో చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయన్నారు. ఆ తర్వాత జయభేరి ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించినట్లు చెప్పారు. కృష్ణ, నాగార్జునతో కలిసి ’వారసుడు’ అనే సినిమాను నిర్మించానని తెలిపారు. ఇద్దరం క్లాస్ మేట్స్ అయినప్పటికీ ‘కృష్ణ గారు’ అనే పిలిచే వాడినని చెప్పారు. అలా గౌరవిస్తూ పిలవద్దని కృష్ణ తన మీద కోప్పడినా సరే, తాను అలాగే పిలిచేవాడినని చెప్పారు. కొంత కాలం తర్వాత ఇద్దరికీ అలవాటు అయ్యిందన్నారు. ఆయనతో కేవలం రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించే అవకాశం తనకు కలిగిందన్నారు. కృష్ణ మిగతా హీరోలతోనూ మంచి సంబంధాలు కొనసాగించేవారని మురళీ మోహన్ చెప్పారు. చాలా మంది హీరోలతో కలిసి నటించినట్లు చెప్పారు.
నిర్మాతల మేలు కోరే వ్యక్తి
కృష్ణ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని మురళీ మోహన్ కొనియాడారు. ఆయన మనసు ఎంతో గొప్పదన్నారు. ఆయన నిర్మాతల హీరో అన్నారు. సినిమా పరాజయం పాలైతే.. నిర్మాతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారని చెప్పారు. వారితో మరో సినిమా ఉచితంగా చేసే వారని చెప్పారు. డబ్బులు లేవని నిర్మాతలు చెప్పినా.. మీరు మొదలు పెట్టండి, మిగతా విషయాలు తాను చూసుకుంటానని చెప్పేవారన్నారు. నిర్మాతల మేలు కోరే కృష్ణ లాంటి నటుడుని తాను ఇంత వరకు చూడలేదని మురళీ మోహన్ చెప్పారు.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్