News
News
X

యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో, అరెస్టు చేసిన పోలీసులు

యాంకర్ తో దురుసుగా ప్రవర్తించిన కేసులో ఓ మలయాళ హీరో అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ ఆయన యాంకర్ ను ఏమన్నాడో తెలుసా?

FOLLOW US: 
 
లయాళ యంగ్ హీరో  శ్రీనాథ్‌ భాసీ అరెస్ట్ అయ్యాడు. కేరళ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయన మీద ఓ లేడీ యాంకర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు, స్టేషన్ మెట్లు ఎక్కించారు.  శ్రీనాథ్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ మహిళా యాంకర్‌ కేరళలోని మరడు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్‌ మధ్యలో తనను అసభ్య పదజాలంతో  దూషించాడని ఫిర్యాదులో పేర్కొంది.  కోపంతో చెప్పలేని మాటలు మాట్లాడాడని వెల్లడించింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీనాథ్‌ బెయిల్ మీద బయటకు వచ్చాడు.

యూట్యూబ్ యాంకర్ తో వాగ్వాదం

‘కప్పెలా’, ‘భీష్మ పర్వం’, ‘ట్రాన్స్’ సహా పలు సినిమాలో నటించి మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనాథ్‌ భాసీని.  స్టార్‌ హీరోగా సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘చట్టంబి’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయనకు ఓ రేంజిలో కోపం వచ్చింది. హీరో అనే విషయాన్ని మర్చిపోయి.. యాంకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.  

యాంకర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు

యాంకర్ తనను అవమానించేలా మాట్లాడిందని భావించిన శ్రీనాథ్‌.. చాలా సీరియస్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. యాంకర్ పై అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడు. ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయాడు. జరిగిన ఘటనపై యాంకర్ తీవ్రంగా స్పందించింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన మీద ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను పోలీసులు ముందు పెట్టింది. పోలీసులు హీరో శ్రీనాథ్‌ మీద 354, 509, 294బీ సెక్షన్ల కింద  కేసు ఫైల్ చేశారు. అతడిని విచారించి అరెస్టు చేశారు.

ఇదంతా సినిమా ప్రమోషన్ స్టంటా?

మరోవైపు ఈ అరెస్టును హీరో శ్రీనాథ్ ఖండించాడు. తనను యాంకర్ అగౌరవ పరిచేలా ప్రశ్నలు అడిగిందని చెప్పారు. ఆమె పిచ్చి ప్రశ్నల మూలంగానే తాను సమయమనం కోల్పోయినట్లు చెప్పాడు. వెంటనే తను బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్ స్టంట్ లో భాగంగానే డ్రామా ఆడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే శ్రీనాథ్ నటించిన ‘చట్టంబి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత

Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Published at : 27 Sep 2022 02:59 PM (IST) Tags: Malayala hero Sreenath Bhasi Sreenath Bhasi arrest anchor case

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham December 7th: సాక్ష్యం సంపాదించిన ఝాన్సీ, చేతులెత్తేసిన యష్ లాయర్ - అందరికీ షాకిచ్చిన వేద

Ennenno Janmalabandham December 7th: సాక్ష్యం సంపాదించిన ఝాన్సీ, చేతులెత్తేసిన యష్ లాయర్ - అందరికీ షాకిచ్చిన వేద

Aryan Khan Bollywood Debut : షారుఖ్ ఖాన్ వారసుడు వస్తున్నాయి - స్క్రిప్ట్ రెడీ

Aryan Khan Bollywood Debut : షారుఖ్ ఖాన్ వారసుడు వస్తున్నాయి - స్క్రిప్ట్ రెడీ

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Narappa Movie Release: థియేటర్లలో ‘నారప్ప’ మూవీ రి-రిలీజ్

Narappa Movie Release: థియేటర్లలో ‘నారప్ప’ మూవీ రి-రిలీజ్

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

టాప్ స్టోరీస్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

Ind vs Bang, 2nd ODI: నేడు భారత్- బంగ్లా రెండో వన్డే- సిరీస్ ఆశలు నిలిచేనా!

Ind vs Bang, 2nd ODI: నేడు భారత్- బంగ్లా రెండో వన్డే- సిరీస్ ఆశలు నిలిచేనా!

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు