News
News
X

SSMB28: మహేష్ బాబు @ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!

SSMB28 సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. 

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 
 
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో మహేష్ బాబు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట. మహేష్ బాబుకి ఇలాంటి సాఫ్ట్ రోల్స్ బాగా సూట్ అవుతాయి. ఇదివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ గా కనిపించారు. కానీ ఈసారి ఉద్యోగిగా కనిపించనున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ లో పూర్తిగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానుంది.

మహేష్ సినిమాలో ఐటెం సాంగ్:

తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. 
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!
 
#SSMB28Aarambham:
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు.
 
'అయోధ్యలో అర్జునుడు':
మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి! 

Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?

News Reels

Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Published at : 06 Oct 2022 03:07 PM (IST) Tags: Mahesh Babu Trivikram SSMB28

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు