Godfather Box Office : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
Godfather Day 1 Collections : చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసింది? సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. విమర్శకుల నుంచి హిట్ రివ్యూస్ వచ్చాయి. మరి, వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
Godfather Worldwide Collection Day 1 : ప్రపంచవ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమాతో పోలిస్తే... తెలుగులో చాలా మార్పులు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ మాసీగా మార్చారు. మలయాళ సినిమాలో కొన్ని క్యారెక్టర్లను కట్ చేశారు. ఇంకొన్ని కొత్త సీన్లు రాసుకున్నారు. మోహన్ రాజా చేసిన మార్పులకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
View this post on Instagram
Godfather First Day Collection In Telugu States : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏపీ, తెలంగాణలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా? అనేది చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో 'గాడ్ ఫాదర్' మొదటి రోజు వసూళ్లు చూస్తే...
నైజాం : రూ. 3.25 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.25 కోట్లు
సీడెడ్ : రూ. 3.05 కోట్లు
నెల్లూరు : రూ. 57 లక్షలు
గుంటూరు : రూ. 1.75 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 73 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 1.60 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 80 లక్షలు
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం... ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే... 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ కలెక్షన్స్ అయితే 20.90 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో 'గాడ్ ఫాదర్' సినిమాకు రూ. 4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందట. షేర్ చూస్తే... 1.8 కోట్లు ఉంది. అమెరికాలో కూడా అంతే! మిగతా ఏరియాల్లో మూడు కోట్ల రూపాయల గ్రాస్ లభించిందని టాక్. ప్రపంచవ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు రూ. 31.9 కోట్లు గ్రాస్ (షేర్ 17.6 కోట్లు) వచ్చిందని ట్రేడ్ టాక్.
View this post on Instagram
వీకెండ్ వరకూ 'గాడ్ ఫాదర్' హవా ఉంటుందా?
సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. దసరా సందర్భంగా 'గాడ్ ఫాదర్' సినిమా బుధవారం విడుదలైంది. ఈ వీకెండ్ వరకు విజయ దశమి సెలవులు ఉన్నాయి. అప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ బరిలో సినిమా హవా ఉంటుందా? లేదా? అనేది చూడాలి. మెగాస్టార్ అభిమానుల జోరు చూస్తుంటే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.
Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!
View this post on Instagram