Guntur Kaaram 5 Days Collection: మహేష్ రికవరీ రేట్ @ 70% - ఐదు రోజుల్లో 'గుంటూరు కారం' వంద కోట్లకు దగ్గరకు వచ్చినా సరే...
Guntur Karam collection day 5: 'గుంటూరు కారం' విడుదలైన రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ... చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన ఐదో రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'గుంటూరు కారం' సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో విడుదలైంది. అయితే... జనవరి 12న తెల్లవారుజామున ఒంటి గంటకు వేసిన ప్రీమియర్ / బెనిఫిట్ షోస్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. మహేష్ వీరాభిమానుల్లో కొందరు సైతం ఆశించిన రీతిలో సినిమా లేదని విమర్శలు చేశారు. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇటువంటి సినిమా వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. అయితే... సంక్రాంతి సీజన్, ఫెస్టివల్ హాలిడేస్, మహేష్ & త్రివిక్రమ్ ఇమేజ్ కలిసి ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి.
ఐదు రోజుల్లో 'గుంటూరు కారం'కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Kaaram Box Office Collection Worldwide: 'గుంటూరు కారం' మొదటి రోజు టాక్ చూసి డిస్ట్రిబ్యూటర్లు సైతం తన పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదోనని కాస్త ఆందోళన పడిన మాట వాస్తవమని ట్రేడ్ వర్గాల టాక్. అయితే... ఇప్పుడు అటువంటి భయాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఆల్రెడీ సినిమా 70 పర్సెంట్ రికవరీ చేసింది. మరో 30 పర్సెంట్ రావాలి. నెక్స్ట్ వీకెండ్, రిపబ్లిక్ డే లోపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఐదో రోజుల్లో ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
- నైజాం ఏరియా (తెలంగాణ) - రూ. 30.40 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ) - రూ. 8.06 కోట్లు
- ఉత్తరాంధ్ర (విశాఖ) - రూ. 8.40 కోట్లు
- తూర్పు గోదావరి - రూ. 6.88 కోట్లు
- పశ్చిమ గోదావరి - రూ. 4.42 కోట్లు
- గుంటూరు - రూ. 7.09 కోట్లు
- కృష్ణ - రూ. 5.26 కోట్లు
- నెల్లూరు - రూ. 2.94 కోట్లు
Also Read: హిందీ డబ్బింగ్ సినిమాల్లో 'హనుమాన్' నయా రికార్డ్ - కుంభస్థలాన్ని బద్దలుకొడుతున్న తేజ సజ్జ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో ఈ సినిమా 73.45 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 110 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజుల్లో ఓవర్సీస్ నుంచి రూ. 13.40 కోట్లు రాగా... కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా నుంచి రూ. 5.60 కోట్లు వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.92 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... 149.10 కోట్లు.
Also Read: కనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?
133 కోట్లకు అమ్మితే 92 కోట్లు వచ్చేశాయ్!
ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 102 కోట్లకు విక్రయించారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 9 కోట్లకు ఇచ్చారు. ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లు. మొత్తం కలిపిస్తే... టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 132 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లు. అందులో ఆల్రెడీ 92.45 కోట్లు వచ్చాయి. మరో రూ. 40 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ డైలీ షేర్ ఆరేడు కోట్లు వస్తోంది. మరో వారం ఈ విధంగా కలెక్షన్స్ వస్తే... బ్రేక్ ఈవెన్ కావడం కష్టం ఏమీ కాదు. సంక్రాంతి పండగ సెలవులు పూర్తి అయ్యాయి. ఫెస్టివల్ మూడ్ నుంచి వర్కింగ్ మోడ్ లోకి ప్రేక్షకులు వస్తున్నారు. మరి ఈ వారం, వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.