Naa Saami Ranga Collection day 3: కనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?
Naa Saami Ranga Box Office AP Telangana share: కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమా వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. మూడో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Nagarjuna's Naa Saami Ranga movie day 4 collection worldwide: బాక్సాఫీస్ బరిలో కనుమ రోజూ కింగ్ అక్కినేని నాగార్జున తన జోరు కంటిన్యూ చేశారు. విడుదలైన మూడో రోజు కూడా 'నా సామి రంగ' సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. సోమవారం సంక్రాంతి కనుక ఆ రోజు వసూళ్లు బావుంటాయి. మంగళవారం వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి పండుగ సెలవులు పూర్తి అయ్యాయి. అయినా సరే థియేటర్లకు జనాలు వచ్చి మరీ సినిమా చూశారంటే... ప్రేక్షకులను 'నా సామి రంగ' ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన 'నా సామి రంగ'... మూడో రోజు 3.58 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఎంత షేర్ వచ్చిందనేది చూస్తే...
- నైజాం (తెలంగాణ) - రూ. 1.05 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ) - రూ. 60 లక్షలు
- విశాఖ (ఉత్తరాంధ్ర) - రూ. 51 లక్షలు
- ఈస్ట్ గోదావరి - రూ. 44 లక్షలు
- వెస్ట్ గోదావరి - రూ. 22 లక్షలు
- కృష్ణ - రూ. 24 లక్షలు
- గుంటూరు - రూ. 34 లక్షలు
- నెల్లూరు - రూ. 18 లక్షలు
మూడో రోజు మేజర్ డ్రాప్ ఏమీ లేదు!
సాధారణంగా వీకెండ్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓపెనింగ్ వీకెండ్ జోరు తర్వాత ఉండదు. కలెక్షన్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అయితే... ఆదివారం విడుదలైన 'నా సామి రంగ' సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
Also Read: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా
Naa Saami Ranga three days collection worldwide: 'నా సామి రంగ' సినిమాకు మొదటి రోజు రూ. 4.33 కోట్ల షేర్ రాగా... సోమవారం రూ. 4.55 కోట్ల షేర్ వచ్చింది. రెండు రోజుల్లో మొత్తం మీద రూ. 8.88 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు షేర్ యాడ్ చూస్తే... విడుదలైన మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.46 కోట్లు వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... వరల్డ్ వైడ్ రూ. 24.8 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read: హాఫ్ సెంచరీ కొట్టిన ‘అయాలన్’ - ధనుష్‌ను వెనక్కి నెట్టిన శివకార్తికేయన్!
బ్రేక్ ఈవెన్ దగ్గరలో 'నా సామి రంగ'
సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే రెండో సినిమా 'నా సామి రంగ' అవుతుందని చెప్పవచ్చు. ఆల్రెడీ 'హనుమాన్' బ్రేక్ ఈవెన్ అయ్యింది. 'నా సామి రంగ' డిజిటల్ & శాటిలైట్ రైట్స్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్', 'స్టార్ మా' సొంతం చేసుకున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకు సుమారు 33 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. దాంతో థియేట్రికల్ రైట్స్ జస్ట్ 18.5 కోట్లకు ఇచ్చేశారు. ఆల్రెడీ 12.8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.