“MAA” Elections: నరేశ్ పార్టీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు.. మందుకొడతారు, కలసి భోజనం చేస్తారు తప్పేముందంటూ కామెంట్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. తాజాగా సీనియర్ నటుడు నరేష్ పెట్టబోయే నైట్ పార్టీపై, అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేశారు. ఇంతకీ ఏమన్నారంటే…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లా అయిపోయాయనే చెప్పుకోవాలేమో. నాలుగైదేళ్లక్రితం వరకూ సైలెంట్ గా జరిగిపోయిన ఈ ఎన్నికలు ఇప్పుడు పోటాపోటీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. `మా` ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించడానికి ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయం మరింత జోరు పెరిగింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను అఫీషియల్ గా ప్రకటించారు. ఎవరెవరిని మెంబర్లుగా తీసుకున్నారో, ఎవరిని మెయిన్ ప్యానల్‌లోకి తీసుకున్నారో చెప్పారు. అయితే సీనియర్ నటుడు నరేశ్.. విందు ఆహ్వానంపై ప్రకాశ్ రాజ్ స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటివరకూ నరేష్ తలపెట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ వ్యతిరేకతను వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ పార్టీ విషయంలో మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పార్టీ ఇవ్వడంలో తప్పేముంది . పగలంతా కళాకారులు షూటింగ్ లో బిజీగా ఉంటారు. అందుకే రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లున్నారని పంచ్ విసిరారు. ‘ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్లలేరు కదా అందుకే పరిచయస్తులందర్నీ పార్టీకి పిలుస్తారు, కలిసి భోజనం చేస్తారు, మందు కొడతారు.. ఇట్స్ ఓకే తప్పులేదు’ అన్నారు. నైట్ పార్టీలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయని..ఎవరి సమస్యలు వారు చెప్పుకోవడానికి పార్టీ మంచి వేదికగా నిలుస్తుందని విలక్షణ నటుడు అనడం కొసమెరుపు.
Also Read: సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు
‘మా’ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రధాన పోటీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మధ్యనే సాగనుంది. మెగాస్టార్ అండదండలతో ప్రకాష్ రాజ్ ఇతరుల కంటే దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతుండగా.. కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ అండదండలతో ఈసారి మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీపడుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు మహిళామణుల్ని ప్రకాష్ రాజ్ తమ ప్యానెల్ వైపు తిప్పేసుకున్నారు. ఆ ఇద్దరిలో జీవిత రాజశేఖర్ సపోర్ట్ మంచు విష్ణుకి ఉంటుందని ఇటీవల అంతా భావించారు. కానీ జీవిత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నారు. అలాగే నటి హేమను కన్విన్స్ చేసి ప్రకాష్ రాజ్ బృందం తమ ప్యానెల్ తరపున పోటీ చేసేలా చేశారు. మొత్తానికి విందు రాజకీయాలతో పోటీపడుతున్న వారిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
Also Read: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్
Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
Also Read: కళ్లజోడు జారకుండా.. దుమ్ము దులిపేస్తున్న ‘టక్ జగదీష్’ సాంగ్.. దర్శకుడు అడ్డంగా బుక్కయ్యాడు!
Also Read:వామ్మో ఎంత హాటో...ఐదు పదులకు చేరువవుతున్నా మతిపోగొట్టేస్తున్న మలైకా...