అన్వేషించండి
Advertisement
Prakash Raj: 'మా'కు పోటీగా కొత్త అసోసియేషన్ రాబోతోందా..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు పోటీగా మరొక కొత్త అసోసియేషన్ రాబోతుందంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. దాని పేరేంటంటే..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు పోటీగా మరొక కొత్త అసోసియేషన్ రాబోతుందంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులంతా 'మా'ని వీడతారని అంటున్నారు. 'మా'కు పోటీగా 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా)' పేరుతో కొత్త అసోసియేషన్ ను ఏర్పాటు చేస్తారని టాక్. 'మా' ఎన్నికల్లో లోకల్-నాన్ లోకల్ అనే వాదన బలంగా వినిపించింది. నిజానికి మంచు విష్ణు విజయానికి ప్రాంతీయవాదం కూడా కలిసొచ్చింది.
తెలుగు నటీనటులు ఉన్న అసోసియేషన్ కి తెలుగువాడినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చాలా మంది పెద్దలు బహిరంగంగానే చెప్పారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ నొచ్చుకున్నారు. తెలుగువాడిగా పుట్టకపోవడం నా తప్పు కాదంటూ చెప్పారు. ఇక ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు మెజారిటీతో విజయం సాధించింది. విష్ణు గెలుపుని స్వాగతించిన ప్రకాష్ రాజ్. ప్రాంతీయవాదం ఉన్న 'మా'లో కొనసాగలేనని చెప్పి.. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కోటా శ్రీనివాసరావు, రవిబాబు లాంటి వాళ్లు చెప్పినట్లుగానే తాను అతిథిగా కొనసాగుతానని అన్నారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అండ్ కో మరో అసోసియేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టడంతో.. ఆయనేం మాట్లాడతారా..? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion