MAA Elections: ఓటర్లకు మోహన్ బాబు వాయిస్ మెసేజ్.. ఆలోచించి ఓటు వేయమంటూ రిక్వెస్ట్..
తాజాగా మంచు విష్ణుకి ఓటు వేయాలని మోహన్ బాబు 'మా' సభ్యులను కోరారట. ఈ మేరకు వారికొక వాయిస్ మెసేజ్ పంపించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగబోతున్నాయి. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. 'మా' సభ్యుల ఓట్లు సంపాదించడానికి చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు మంచు విష్ణుకి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. తన కొడుకుని గెలిపించుకోవడం కోసం ఏకంగా మోహన్ బాబు రంగంలోకి దిగారు. దాదాపు 700 మంది సభ్యులతో మోహన్ బాబు ఫోన్లో మాట్లాడారని మంచు విష్ణు చెప్పారు.
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
అలానే మంచు విష్ణుని వెంటబెట్టుకొని ఇండస్ట్రీలో పెద్దలను కలిశారు. కృష్ణంరాజు, కృష్ణ, కోటా శ్రీనివాసరావు వంటి పెద్దల సపోర్ట్ మంచు విష్ణుకే అని తెలుస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనేది ఒకరకంగా ప్రెస్టీజియస్ గా మారింది. ఇక తాజాగా మంచు విష్ణుకి ఓటు వేయాలని మోహన్ బాబు 'మా' సభ్యులను కోరారట. ఈ మేరకు వారికొక వాయిస్ మెసేజ్ పంపించారు.
అందులో ఆయన ఏం చెప్పారంటే.. ''తెలుగువాళ్లు ఒకటిగా ఉండాలనే 'మా' ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 'మా' ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకి కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరేం చేసినా.. 'మా' అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి'' అని చెప్పారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి