(Source: ECI/ABP News/ABP Majha)
Nagababu: ప్రకాష్ రాజ్‌తో మాకు చాలా విభేదాలున్నాయి.. నరేష్‌కు అదే బ్యాడ్ హ్యాబిట్.. నాగబాబు క్లారిటీ
‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై నాగబాబు స్పందించారు. ప్రకాష్ రాజ్‌తో తనకు అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూనే.. ఆయన గురించి నాగబాబు గొప్పగా చెప్పడం గమనార్హం.
ప్రకాష్ రాజ్, నేను స్నేహితులం కాదు. ఆయనకు, నాకు ఎన్నో విషయాల్లో చాలా అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ, ఆయన మా అన్నయ్యకు క్లోజ్. అన్నయ్యకు క్లోజైతే.. మాకు కూడా క్లోజే. నేను బీజేపీకి అనుకూలం, ఆయన కమ్యునిస్టు భావాలు కలిగినగారు. కానీ, ఆయన మానవతావాది. మన భారత దేశంలోనే గొప్ప నటుడు.
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అభ్యర్థి కోసం ఎవరికైనా మాట ఇచ్చావా అని అన్నయ్య అడిగారు. దీంతో ఆయన ప్రకాష్ రాజ్ పేరు చెప్పారు. దీంతో నేను మంచి చాయిస్ అని చెప్పాను. ప్రకాశ్‌రాజ్ ఆలోచనలకు ఎలక్షన్‌లు చిన్న విషయం. నేనే వచ్చి సేవ చేస్తానని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘మా’ కోసం కొన్ని సినిమాలు వదులుకుని వస్తానని తెలిపారు. ప్రకాశ్ రాజ్ భారతీయ నటుడు. సమస్య వస్తే మోదీ, అమిత్‌షాతో మాట్లాడే దమ్మున్న వ్యక్తి. విష్ణు ప్యానెల్‌లో ఎవరికైనా అంత దమ్ముందా? ముళ్ల కిరిటం పెట్టుకునేందుకు సిద్ధమైన వ్యక్తి ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ ఈసారే కాదు మరో రెండుసార్లు ప్రెసిడెంట్‌గా ఉండాలి.
ప్రకాశ్ రాజ్ వల్ల మా ప్రతిష్ట మరింత వృద్ది చెందుతుంది. మా బిల్డింగ్ ఎందుకు అమ్మారో నరేష్‌ను అడగాలి. ఓటుకు పదివేలు ఇస్తున్నారని తెలుస్తోంది. అలా ఇస్తే మా ప్రతిష్ట మసకబారుతుంది’’ అని నాగబాబు అన్నారు.
‘‘మనది చాలా చిన్న అసోసియేషన్. ఈ అసోసియేషన్‌లో పబ్లిక్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వ్యక్తికి ఉన్న బ్యాడ్ హాబిట్ ఈ వేళ ప్రతిసారి పబ్లిక్‌లోకి వెళ్లాల్సి దుస్థితి పట్టింది. ఆ వ్యక్తి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ప్రముఖ శ్రీకృష్ణ పాత్రదారి’’ అంటూ నరేష్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘అతన్ని చూస్తేనే నాకు కొంచెం భయం వేస్తుంది. నరేష్ మంచి ఫ్రెండే.. కానీ, మరీ అలా మాట్లాడితే తట్టుకోలేం కదా. మా సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యే ఉండదు. లాస్ట్ టైం నరేష్ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చాను. నేను సపోర్ట్ ఇవ్వడం వల్లే నరేష్ ప్యానల్ గెలిచిందని చెప్పలేను. కేవలం మద్దతు మాత్రమే ఇవ్వగలను’’ అని అన్నారు.
ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు: ఆయన గొప్ప నటుడు.. ఐదు సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన చాలా టాలెంటెడ్, చాలా బిజీ. ఇక్కడ పోటీ చేస్తానంటే.. ‘మా’కు సమయం కేటాయించగలవా అని ప్రశ్నించాను. ఇందుకు అతడు అవసరమైతే సినిమాలు వదులుకొనైనా ‘మా’ కోసం పని చేస్తాను. సినిమాకు రూ.కోటి సంపాదించే సత్తా ఉన్నా అతడు.. ఆ మొత్తాన్ని కూడా వదులుకోడానికి సిద్ధమయ్యారు. ప్రకాష్ రాజ్ ఒక ప్రాంతానికే పరిమితమైనవాడు కాదు.. అతడు భారతీయ నటుడు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో నటించారు. ఇప్పటివరకు ఏ నటుడు అన్ని భాషల్లో నటించలేదు. ప్రకాష్ రాజ్ తెలుగోడు కాదు.. కానీ, తెలుగు సినిమాలకు అవసరమా? కాస్త ఎదగండి.. వయస్సు వచ్చే కొద్ది బాధ్యతాయుతంగా ఉండాలి. వయస్సు పెరిగేకొద్ది తగ్గిపోకూడదు’’ అంటూ విష్ణు ప్యానెల్‌కు నాగబాబు చురకలు అంటించారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
బాబు మోహన్, కోట.. ప్రకాష్ రాజ్ ఎవరు అని అడిగారు: కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ప్రకాష్ ఎవరు అని అడిగేవారు. అంత ఈర్ష్యా ఎందుకు? ‘మా’ బాధ్యత ముళ్ల కిరీటం అని తెలుసు కూడా ప్రకాష్ రాజ్ వచ్చారు. కొంతమంది ఆ బాధ్యతను ఎంజాయ్ చేస్తారు. కానీ, బాధ్యతగా ఉండరు. నువ్వు పవన్ కళ్యాణ్ వైపా లేదా ఇండస్ట్రీ వైపా అని విష్ణు అడగడం ఆశ్చర్యమేసింది. నేను ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చేందుకు కూడా నా మీద ఆరోపణలు చేశారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!