Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ను ‘నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్’ అని ఎందుకంటారు? ఆమె అందుకున్న పురస్కారలేమిటి?
భారత ప్రభుత్వం నుంచి అత్యుత్తమ అవార్డులు అందుకున్న గాయని లతా మంగేష్కర్ అనే చెప్పాలి. ఆమె అవార్డుల లిస్ట్ ఇదే..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్(Lata Mangeshkar) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన లతా మంగేష్కర్ చిన్నప్పటినుంచే తండ్రి దగ్గర సంగీతంలో శిక్షణ పొందారు. నాటకాల్లో కూడా నటించేవారు. సంగీతాన్నే తన కెరీర్ గా మార్చుకొని పాటలు పాడడం మొదలుపెట్టారు. లతా మంగేష్కర్‌ను 'నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్' అని కూడా అంటారు. బాలీవుడ్‌లో ఎన్నో పాటలకు ఆమె గాత్రదానం చేశారని చెప్పడం కంటే.. ప్రాణం పోశారని చెప్పవచ్చు. అందుకే అంతా ఆమెను 'నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్' అని అంటారు. తన కెరీర్ లో కొన్ని వేల పాటలు పాడిన ఆమె 1959లో తొలిసారిగా 'మధుమతి' అనే సినిమా 'ఆజారే పరదేశి' పాటకు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 1972లో 'పరిచా' అనే సినిమాలో పాటలు పాడినందుకు గాను ఆమెకు భారత జాతీయ ఉత్తమ సింగర్ అవార్డు లభించింది. అదే అవార్డును ఆమె 1974, 1990లలో కూడా అందుకున్నారు.
భారత ప్రభుత్వం నుంచి అత్యుత్తమ అవార్డులు అందుకున్న గాయని లతా మంగేష్కర్(Lata Mangeshkar Awards) అనే చెప్పాలి. ఆమె అవార్డుల లిస్ట్ ఇదే..
పద్మభూషణ్ (1969)
దాదా సాహెబ్ ఫాల్కే (1989)
మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997)
ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
రాజాలక్ష్మీ అవార్డు (1990)
పద్శవిభూషణ్ (1999)
భారతరత్న (2001)
ది లీజియన్ అఫ్ హానర్ (2006)
ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009)
అప్సరా అవార్డు
కాళిదాస్ సమ్మాన్ అవార్డు
తాన్ సేన్ అవార్డు
నేపాల్ అకాడమీ అవార్డు
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు.
లతా మంగేష్కర్(Lata Mangeshkar) గురించి ఎంత చెప్పుకున్నా.. ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుంది. అదే ఆమె గొప్పతనం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు.
View this post on Instagram