Lavanya Tripathi: నవ్విస్తానంటున్న అందాల రాక్షసి... కొత్త సినిమాకు సంతకం చేసింది!
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి కొత్త సినిమాకు సంతకం చేశారు. ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు.
హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ప్రేమకథా చిత్రాల్లో నటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు. కామెడీ థ్రిల్లర్స్ చేశారు. 'చావు కబురు చల్లగా' వంటి డిఫరెంట్ సినిమాలో కనిపించారు. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్నారు. అవును... 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు.
'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రితేష్ రాణాతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. అందులో లావణ్యా త్రిపాఠి హీరోయిన్. హీరో ఎవరనేది త్వరలో వెల్లడి కానుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని లావణ్యా త్రిపాఠి చెబుతున్నారు. క్యారెక్టర్ కోసం వర్క్‌షాప్స్‌కు కూడా అటెండ్ అవుతున్నారు. స్క్రిప్ట్‌తో పాటు తనకు స్క్రీన్‌ప్లే బాగా నచ్చిందని ఆమె తెలిపారు.ఈ సినిమాలో తన లుక్ కొత్తగా ఉంటుందని, క్యారెక్టర్ కోసం మేకోవర్ అవుతున్నానని, ఆ లుక్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని లావణ్యా త్రిపాఠి పేర్కొన్నారు.
రియల్ లైఫ్‌లో లావణ్యా త్రిపాఠి సరదాగా ఉంటారు. జోకులు వేస్తారు. తన చుట్టుపక్కలు ఉన్నవాళ్లను నవ్విస్తారు. కానీ, ఇప్పటివరకూ సినిమాలో కామెడీ క్యారెక్టర్ చేయలేదు. ఆన్ స్క్రీన్ కామెడీ రోల్ చేయడం ఇదే తొలిసారి. రీసెంట్‌గా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. 'చావు కబురు చల్లగా' తర్వాత ఆమె సంతకం చేసిన సినిమా ఇదే. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. సినిమాల ఎంపికలో లావణ్యా త్రిపాఠి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖాళీ సమయాల్లో ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. సొంతూరు డెహ్రాడూన్ దగ్గరలో మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ వద్దకు వెళుతున్నారు.
View this post on Instagram
Also Read: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్ బులిటెన్ విడుదల..
Also Read: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్
Also Read: రకుల్ హిందీ సినిమా టైటిల్ మారింది... అంతా అజయ్ దేవగణే చేశారు!
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి