SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ ని లాక్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2006లో ఏప్రిల్ 28న మహేష్ 'పోకిరి' సినిమా రిలీజై ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు మరోసారి అదే డేట్ న రావడానికి రెడీ అవుతున్నారు.
తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
విలన్ గా తమిళ స్టార్:
SSMB28 సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.
తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్:
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. పాటలు ఎలా ఉండాలి? ఏయే సందర్భాల్లో వస్తాయి? అనే విషయాలను తమన్ తో డిస్కస్ చేశారు త్రివిక్రమ్. మహేష్, త్రివిక్రమ్ లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ తమన్ కొన్నిరోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టారు.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?
The Reigning Super Star will arrive on 28th April 2023! 🔥🤩
— Haarika & Hassine Creations (@haarikahassinee) August 18, 2022
Get ready to witness Super Star @urstrulymahesh in a scintillating Massy look & high octane entertainer ~ #SSMB28 🌟#Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #SSMB28From28April pic.twitter.com/PekTnekbhX