News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kriti Sanon On Adipurush: అస్సలు ఊహించలేదు - ‘ఆదిపురుష్’ టీజర్‌పై ఎట్టకేలకు స్పందించిన కృతి సనన్

‘ఆది పురుష్’ టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన నెగెటివ్ రియాక్షన్స్ పై తాజాగా కృతి సనన్ స్పందించింది. ఆ ట్రోలింగ్ తనను చాలా బాధించినట్లు చెప్పింది. ఈ స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని ఊహించలేదన్నది.

FOLLOW US: 
Share:

ప్రభాస్, కృతి సనన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘ఆది పురుష్’. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తుండగా, సైఫ్ రావణుడిగా కనిపించనున్నాడు. కృతి సనన్ సీతగా కనిపిస్తోంది. సన్నీ సింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

‘ఆది పురుష్’ టీజర్‌పై దారుణమైన ట్రోలింగ్

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. రామాయణాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దారుణమై ట్రోలింగ్ కు గురయ్యింది. పెద్ద సంఖ్యలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలో వాడిన వీఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్లు వచ్చాయి. పిల్లలు చూసే కార్టూన్ ప్రోగ్రామ్ గా ఉందంటూ జనాలు ట్రోల్ చేశారు.  

విమర్శలు బాధించాయి- కృతి సనన్  

తాజాగా కృతి సనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆది పురుష్’ సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమా టీజర్ విషయంలో వచ్చిన ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. నెగెటివ్ కామెంట్స్ తనను  నిరుత్సాహానికి గురి చేశాయని చెప్పింది. “సహజంగానే నాకు చాలా బాధ కలిగింది. నెటిజన్స్ నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ఊహించలేదు. కానీ, మేకర్స్ మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. సినీ అభిమానుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా స్వీకరించక తప్పదు. అందుకే మేకర్స్ విన్నారు. వచ్చిన కామెంట్స్ ఎంత వరకు వాస్తవమో పరిశీలించారు. అవసరమైన చోట్ల దిద్దుబాట్లు చేశారు“ అని చెప్పింది.

జూన్ 16 ‘ఆది పురుష్’ సినిమా విడుదల

వాస్తవానికి గతేడాది ‘ఆది పురుష్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే జూన్ 16, 2023కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. "’ఆది పురుష్’ అనేది సినిమా కాదు. శ్రీ రాముడి పట్ల మనకున్న భక్తిని, మన సంస్కృతి, చరిత్ర పట్ల ఉన్న నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ మూవీనికి అందరికీ నచ్చేలా తీర్చిదిద్దేందుకు సినిమాపై పని చేస్తున్న బృందాలకు మరింత సమయం ఇవ్వాలి. ‘ఆది పురుష్’ జూన్ 16, 2023న విడుదల కానుంది. భారతదేశం గర్వించ దగ్గ సినిమా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. మీ మద్దతు, ప్రేమ, ఆశీస్సులు  మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి” అని ఓం రౌత్ వెల్లడించారు.   

గత కొంత కాలంగా కృతి సనన్, ప్రభాస్ గురించి బోలెడన్నీ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే నిశ్చితార్థం జరగబోతోందని వార్తలు వచ్చాయి. మాల్దీవుల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని కృతి స్పష్టం చేసింది. 

Read Also: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Published at : 10 Feb 2023 02:36 PM (IST) Tags: Kriti Sanon Adipurush Teaser negative reactions

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!