Kriti Sanon: కొత్త వ్యాపారం మొదలు పెట్టిన ‘ఆదిపురుష్’ జానకి
అందాల తారు కృతి సనన్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన సోదరి నుపురు సనన్ తో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా తన కొత్త బిజినెస్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించింది.
‘ఆదిపురుష్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, జానకి పాత్రలో కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నటిగా బాలీవుడ్‌లో దాదాపు దశాబ్దం పూర్తి చేసుకున్న కృతి సనన్, ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించింది. బీ టౌన్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టింది. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోగో సహా పలు వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించింది.
సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన కృతి సనన్
తాజాగా ఇన్ స్టా వేదికగా కృతి సనన్ తన ప్రొడక్షన్ హౌస్ లోగోతో పాటు చిన్న క్లిప్ ను షేర్ చేసింది. తన నిర్మాణ సంస్థకు ‘బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’ అనే పేరు కూడా కన్ఫామ్ చేసింది. కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ప్రకటించింది. తన కెరీర్ గేర్ మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. “గేర్ మార్చే సమయం వచ్చింది. నేను 9 సంవత్సరాలుగా ఈ కల కోసం ఎదురు చూస్తున్నాను. సినిమా పరిశ్రమలో ఎన్నో కలలు కంటూ వస్తున్నాను. బేబీ స్టెప్స్ వేశాను. నేర్చుకున్నాను. పరిణామం చెందాను. ఈ రోజు నటిగా ఎదిగాను. ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి అంశాన్ని నేను పరిశీలించాను. ఇప్పుడు నేను మీకో విషయాన్ని చెప్తాను. ఇకనై నా హృదయాన్ని తాకే, మీ గురించి ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి, మరింత చేయడానికి సమయం ఆసన్నమైంది. నిండు హృదయంతో, పెద్ద కలలతో ‘బ్లూ బటర్ ప్లై ఫిల్మ్స్’ సంస్థను ప్రారంభిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు సంతోషిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
View this post on Instagram
వరుస సినిమాలో కృతి ఫుల్ బిజీ
కృతి సనన్ చివరిగా ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కనిపించింది. ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పలు వివాదాలకు కారణం అయ్యింది. ఇక కరీనా కపూర్, టబు కలిసి నటించిన ‘క్రూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు షాహిద్ కపూర్‌తో కలిసి ఒక చిత్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘గణపత్’ చిత్రం ఆమె లైనప్ లో ఉంది. ‘గణపత్’ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది.
View this post on Instagram
Read Also: ఈ బార్బీ ఇంట్లో మీరూ స్టే చేయొచ్చు, ఈ ఫొటోలు చూస్తే ఆశ్చరపోతారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial