ఈ బార్బీ ఇంట్లో మీరూ స్టే చేయొచ్చు, ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు!
బార్బీ ప్రపంచంలో జీవించాలని భావిస్తున్నారా? అక్కడి వస్తువులతో సరదాగా గడపాలని ఉందా? అయితే, మీరు జులై 17 నుంచి Airbnbలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. రోజుకు అద్దె కేవలం రూ. 60 డాలర్లు మాత్రమే.
బార్బీ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. బార్బీ మాలిబు డ్రీమ్ హౌస్ గురించి కూడా వివరించాల్సిన పని లేదు. గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన ‘బార్బీ’ చిత్రాన్ని ఇక్కడే తెరకెక్కించారు. ఇప్పుడు అది సందర్శకుల గురించి అందుబాటులోకి వచ్చింది. పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా కాలిఫోర్నియాలో ఈ మాలిబు భవంతి ఉంది. మాలిబు డ్రీమ్‌హౌస్ ఫిల్మ్ మేకర్ గ్రెటా గెర్విగ్ చిత్రం ‘బార్బీ’ విడుదలకు ముందే ఈ భవంతి తలుపులు తెరుచుకోనున్నాయి. బార్బీ అభిమానులు ఎవరైనా ఇందులో నివసించే అవకాశం ఉంది. అయితే, ఇందుకు ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
జులై 17 నుంచి బుకింగ్స్ షురూ!
బార్బీ మాలిబులోని తన విలాసవంతమైన భవనంలో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ భవనం త్వరలో అద్దెకు అందుబాటులోకి రానుంది. జులై 17 నుంచి Airbnb లో అద్దె కోసం బుకింగ్ చేసుకోవచ్చు. డ్రీమ్ హౌస్‌లో ఒక రోజు ఖర్చు $ 60 మాత్రమేనని నిర్వాహకులు తెలిపారు. Airbnb అధికారిక వెబ్ సైట్ ప్రకారం, మాలిబు డ్రీమ్ హౌస్ బుకింగ్‌లు జూలై 17న ప్రారంభమవుతాయి. జులై 21, 22 తేదీల్లో ఒక్కో గెస్ట్ ఉచితంగా బస చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ అవకాశం దక్కనుంది. బార్బీ బొమ్మ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈ భవంతిలో ఉండేందుకు 2019లో Airbnb ఒక రాత్రికి $60 (సుమారు రూ. 4,900) వసూలు చేశారు. ఈ సారి కూడా అద్దె అంతే అయినా, లక్కీ విన్నర్స్ కు బస ఉచితం అని ప్రకటించారు. మాలిబు హౌస్ ఇటీవల గులాబీ రంగును అద్దుకుంది. సముద్ర తీరంలో అత్యంత రమణీయంగా కనిపిస్తోంది.
మాలిబు డ్రీమ్ హౌస్ ఎన్నో వసతులు!
బార్బీ మాలిబు డ్రీమ్‌హౌస్ సముద్రానికి ఎదురుగా మూడు అంతస్థులలో చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, రెండు బాత్ రూమ్‌లు, ఒక వ్యక్తిగత సినిమా హాల్, ఒక స్టూడియో, ఒక ధ్యాన కేంద్రం, ఓపెన్ డైనింగ్ హాల్, ఒక వంటగది ఉన్నాయి. పనోరమిక్ వ్యూతో పాటు, రోలర్-స్కేటింగ్ రింక్, అవుట్ డోర్ డిస్కో డ్యాన్స్ ఫ్లోర్, ఇన్ఫినిటీ పూల్, బార్, తోటి అతిథులతో కొన్ని సరదా కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇంపాలా స్కేట్‌లు, సర్ఫ్ బోర్డులు అందుబాటులో ఉండనున్నాయి.
బార్బీ మాలిబు డ్రీమ్ హౌస్ అందాలనుు ఈ ఫొటోల్లో చూడండి
View this post on Instagram
అద్దె డబ్బు ఏం చేస్తారంటే?
Airbnb వెబ్‌సైట్ ప్రకారం, అద్దెకు ఇవ్వగా వచ్చిన డబ్బును నిర్వాహకులు ఛారిటీకి అందివ్వనున్నారు. 100కు పైగా దేశాల్లో పిల్లలకు సహాయం చేస్తున్న ‘సేవ్ ది చిల్డ్రన్’ సంస్థకు ఈ అమౌంట్ ను విరాళంగా ఇవ్వనున్నారు. “జులై 21న బార్బీ థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా, బాలికల సాధికారత కోసం విళారం ఇవ్వంబోతున్నాం. 100 దేశాల్లో పిల్లలకు సేవలు అందిస్తున్న ‘సేవ్ ది చిల్డ్రన్’కు ఈ డబ్బును అందిస్తాం. బాలికలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఈ డబ్బు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాం” అని Airbnb ప్రకటించింది.
జులై 21న ‘బార్బీ’ మూవీ విడుదల
జులై 21న బార్బీ మాలిబు డ్రీమ్‌హౌస్ తలుపులు తెరుచుకోగా, గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన ‘బార్బీ’ చిత్రం కూడా అదే రోజున థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, మార్గోట్ రాబీ, అమెరికా ఫెరారా, కేట్ మెక్ కిన్నన్, ఇస్సా రే, రియా పెర్ల్‌మాన్, విల్ ఫెర్రెల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులు? ఆవిడ రష్యాకు తిరిగి వెళ్లిపోయారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial