అన్వేషించండి

Pawan Kalyan- Anna Lezhnova: మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులు? ఆవిడ రష్యాకు తిరిగి వెళ్లిపోయారా?

పవన్ కల్యాణ్ ముచ్చటగా మూడో పెళ్లికి కూడా శుభంకార్లు వేసినట్లు తెలుస్తోంది. భార్య అన్నా లెజ్నెవాతో విడిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. నచ్చితే కలిసి ఉంటారు. నచ్చకపోతే విడిపోతారు. అయినప్పటికీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బహుశ పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి జరిగినంత చర్చ మరే నటుడి గురించి జరిగి ఉండకపోవచ్చు. ఇప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో భార్యతో ఉంటున్నారు. అయితే, తాజాగా ఓ సంచలన విషయం వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. పవన్ మూడో భార్యతోనూ ఆయన విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

రష్యాకు వెళ్లిపోయిన అన్నా లెజ్నెవా?

వాస్తవానికి మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. అఫీషియల్ స్టేట్మెంట్ లేకపోయినా, ఇప్పటికే అన్నా లెజ్నెవా పవన్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పిల్లలతో తిరిగి రష్యాకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ కల్యాన్ ఫోన్ ద్వారా వారితో టచ్ లో ఉన్నారట.    

విడాకుల ఊహాగానాలు ఎప్పటి నుంచి అంటే?

పవన్, లెజ్నెవా కలిసి ఉన్న రోజుల్లో మెగా ఫ్యామిలీలో జరిగే అన్ని ముఖ్యమైన వేడుకలకు ఇద్దరు కలిసి హాజరయ్యేవారు. కానీ, రీసెంట్ గా పలు మెగా వేడుకలకు వాళ్లు ఇద్దరు కలిసి రాలేదు. పైగా పవన్ ఒక్కరే కనిపించారు. రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో కూడా లెజ్నెవా కనిపించలేదు. అటు వారాహి యాత్రకు ముందు పవన్ నిర్వహించిన రాజకీయ యాగంలోనూ ఆమె కనిపించలేదు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లింకారా కొణిదెల నామకరణ కార్యక్రమానికి కూడా పవన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే వారి విడాకుల గురించి విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తల వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదు. పవన్ ప్రత్యర్థులు కావాలనే దీన్ని హైలెట్ చేసి.. మరోసారి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అభిమానులు అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది.

పవన్, అన్నా లెజ్నెవా గురించి..

పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా 2013 లో వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా పవనోవా,  మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలుత నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత తనతో కలిసి ఓ సినిమాలో నటించిన  రేణు దేశాయ్‌ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అయ్యాక, విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను మూడో వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ పెళ్లి కూడా పెటాకులు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.    

వరుస సినిమాలతో పవన్ బిజీ

ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పవన్ తన మేనళ్లుడితో కలిసి యాక్ట్ చేస్తున్నారు. జులై 28న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అటు క్రిష్ జాగర్లమూడి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీర మల్లు’లో కూడా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ తో కలిసి ‘OG’ మూవీలో పని చేస్తున్నారు.

Read Also: మన హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కింగ్ ఎవరు? ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget