అన్వేషించండి
Advertisement
Krithi Shetty: స్టార్ కమెడియన్ ను ఇమిటేట్ చేసిన 'ఉప్పెన' బ్యూటీ..
నటి కృతిశెట్టి 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది.
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదల కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు 'బంగార్రాజు' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది ఈ టీనేజ్ బ్యూటీ. నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఈ బ్యూటీ 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది. 'బంగార్రాజు' చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఈ షోకి వచ్చారు. వీరిద్దరూ కలిసి అలీతో ఫన్ చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అలీ తన ముద్దు పేరుతో పిలవడంతో కృతిశెట్టి ఆశ్చర్యపోయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు కూడా తెలియదు.. మీకెలా తెలుసంటూ ఇన్నోసెంట్ గా అలీని ప్రశ్నించింది.
ఆ తరువాత 'మీ ఊర్లో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు.. ఇంత అందంగా పుట్టడానికి అక్కడ ఏమైనా అమ్ముతారా..?' అని అలీ అడగ్గా.. 'వాటర్ లోనే ఏదో ఉందంటూ..' చెప్పింది కృతి. 'ఉప్పెన' సినిమా తరువాత ఇండస్ట్రీ నుంచి ఓ ప్రముఖ నటుడు తనను ప్రశంసిస్తూ ఓ లెటర్ రాశారని చెప్పింది కృతిశెట్టి. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే చేస్తారా..? అని అలీ ప్రశ్నించగా.. తెల్లమొహమేసింది కృతిశెట్టి.
బ్రహ్మానందం గారంటే చాలా ఇష్టమట కదా.. ఆయన్ని ఎక్స్ ప్రెషన్స్ కూడా పెడతారని విన్నాం అని అలీ అడగ్గా.. వెంటనే బ్రహ్మానందంని తన స్టైల్ లో ఇమిటేట్ చేసింది కృతిశెట్టి. మధ్యలో కళ్యాణ్ కృష్ణ వేసే పంచ్ లతో ఈ ప్రోమో చాలా ఫన్నీగా సాగింది.
Also Read: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..
Also Read: వెంకీ మామ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా..?
Also Read: కనుబొమ్మలు ఎగరేసిన హీరోయిన్.. సిగ్గుపడిపోయిన చైతు.. వీడియో వైరల్..
Also Read: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ..
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion