అన్వేషించండి

Krishna Mukunda Murari June 3rd: మరో బాంబ్ పేల్చిన ముకుంద, షాక్లో రేవతి- మురారీ ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకునేందుకు కృష్ణ ప్రయత్నం

మురారీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ, మురారీ ఒకరి మీద మరొకరకి ఉన్న ప్రేమ బయట పెట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. తను కోల్పోయిన జీవితం తనకి కావాలని ముకుంద అడిగిన మాటలు రేవతి గుర్తు చేసుకుంటూ ఉండగా మురారీ వస్తాడు. అమ్మకి అంతా తెలిసిపోయిందా ముకుంద మొత్తం చెప్పేసిందా ఎందుకు అలా చూస్తుందని తల్లి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. కృష్ణని ఇవాళ బయటకి తీసుకెళ్తాను గురువుగారు నా మనసులో మాట చెప్తాను తన మనసులో ఏముందో తెలుసుకుంటాను. ముకుంద మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని బయట పెట్టకముందే ఈ విషయం తేల్చుకుంటాను. మా బంధం వన్ ఇయర్ కాకుండా జీవిత కాలం పొడిగించాలని అనుకుంటే ముకుంద ఏమవుతుందో? కానీ ముందు కృష్ణ బయట పడాలి కదా అనుకుని నిద్రపోతున్న తనని లేపుతాడు.

Also Read: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు

రెస్టారెంట్ కి వెళ్దామని అంటే ఏమైనా మాట్లాడాలా అంటుంది. ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అంటే అవునని చెప్తాడు. నాతో చెప్పాలనుకుంటుంది ఏముంది ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి గురించా? అని కృష్ణ ఆలోచిస్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని నవ్వుకుంటారు. మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకుని ఇంత మనస్పూర్తిగా ఎలా నవ్వగలుగుతున్నారు ఏంటని కృష్ణ అనుకుంటుంది. రెస్టారెంట్ కి వెళ్ళాలి కదా నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయమని మురారీ అడుగుతాడు. మళ్ళీ కబోర్డ్ లో డైరీ పెట్టిన విషయం గుర్తొచ్చి దాన్ని చూసేస్తుందేమోనని కంగారు పడతాడు. కృష్ణ తీసిన డ్రెస్లో డైరీ ఉండేసరికి అది ఎక్కడ కనిపిస్తుందానని టెన్షన్ పడతాడు. ఆ డైరీ నేను ఎక్కడ చూస్తానోనని టెన్షన్ పడుతున్నాడని కృష్ణ పసిగట్టేస్తుంది. ఇది నేను వేసుకుంటాలే లోపలికి వెళ్ళమని తనని హడావుడిగా పంపించేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి ఎవరో నేను చదివేశానని ఆయనకి తెలియదు కదా అనుకుంటుంది.

కృష్ణ వెళ్లిపోగానే మురారీ డైరీ తీస్తాడు. ముందు ముకుంద గురించి రాసినా తర్వాత కృష్ణ గురించి రాసింది చదివితే నా ప్రేమ అర్థం చేసుకుంటుంది ఏమోనని ఆశపడతాడు. కృష్ణ, మురారీ బయటకి వెళ్తూ రేవతి దగ్గరకి వెళ్ళి చెప్తుంది. ఇవాళ సండే కదా అని బ్రేక్ ఫాస్ట్ కి బయటకి వెళ్తున్నామని కృష్ణ అంటే సరే వెళ్ళమని రేవతి కూడా పర్మిషన్ ఇస్తుంది. మురారీ మాత్రం తల్లికి ఎదురుపడలేక తలదించుకుని వెళతాడు. ఏమైంది మీకు వచ్చేటప్పుడు అత్తయ్యకి చెప్పకుండా వచ్చారని కృష్ణ అడిగితే ఏం లేదని అంటాడు. ముకుంద తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ లో మాట్లాడుతుంది. ఆ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా? అగ్రిమెంట్ పూర్తవగానే కృష్ణ వెళ్ళిపోతుంది. కానీ ఈలోపు మురారీకి కృష్ణ మీద ప్రేమ కలిగితే నా పరిస్థితి ఏంటాని ముకుంద తన భయాన్ని స్నేహితురాలితో పంచుకుంటుంది.

Also Read: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'

మురారీ వాళ్ళు ఎక్కడ ప్రేమలో పడతారోనని చిన్నత్తయ్యకి ప్రేమ గురించి చెప్పేశాను. కృష్ణ, మురారీ మధ్య ప్రేమ లేదని తెలిస్తే మా పెళ్లికి అందరూ ఒప్పుకుంటారని సంబరంగా చెప్తుంది. ముకుంద వాళ్ళు ఉన్న రెస్టారెంట్ కి కృష్ణ వాళ్ళు కూడా వస్తారు. మనం కూర్చునే ప్లేస్ లో ఎవరో కూర్చున్నారని చూసి ముకుంద అని పలకరిస్తుంది. గీతిక మురారీని పలకరించి నీ గురించే మాట్లాడుకుంటున్నామని అనేసరికి కృష్ణ షాకింగ్ గా చూస్తుంది. వాళ్ళని పలకరించేసి వెళ్లిపోతారు. టిఫిన్ కి కూడా రెస్టారెంట్ కి వచ్చారంటే వాళ్ళు ప్రేమలో పడిపోయారని అనిపిస్తుందని గీతిక అనేసరికి ముకుంద బిత్తరపోతుంది. గీతిక గురించి మురారీని అడుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పట్టించుకోకుండా ఫోన్ చూసుకున్న సహస్ర! విహారి ఫైర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పట్టించుకోకుండా ఫోన్ చూసుకున్న సహస్ర! విహారి ఫైర్!
Horror Comedy OTT : మంత్రగత్తె కోడలు Vs జాయింట్ ఫ్యామిలీ - నవ్వులు పూయిస్తూనే భయపెట్టే మూవీ... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
మంత్రగత్తె కోడలు Vs జాయింట్ ఫ్యామిలీ - నవ్వులు పూయిస్తూనే భయపెట్టే మూవీ... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget