Krishna Mukunda Murari June 2nd: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'
ముకుంద ప్రేమ సంగతి రేవతికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రోడ్డు మీద ఒక జంట ఫ్రెండ్షిప్, ప్రేమ గురించి తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరకి మురారీ, కృష్ణ వెళతారు. ఒకసారి ప్రేమిస్తే అది మనసులో పుట్టుమచ్చలా ఉండిపోతుంది. ఎప్పటికీ అది చెరిగిపోదని మురారీ అంటాడు. ప్రేమించగానే సరిపోదు అది పెళ్లిగా మార్చుకోవాలి లేదంటే మర్చిపోవాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించాలంటే ఒక అర్హత ఉండాలి. బలవంతంగా పెళ్లి చేసుకోగలరు కానీ ప్రేమించలేరని కృష్ణ బాధగా చెప్తుంది. ఆ జంట ఏం మాట్లాడకుండా వెళ్లిపోతారు. వాళ్ళలో తమ జంటని ఊహించుకుని కృష్ణ బాధపడుతుంది. మురారీ ఇంటికి వచ్చేసరికి కారు దగ్గర ముకుంద ఎదురుచూస్తుంది.
ముకుంద: నీకోసమే ఎదురుచూస్తున్నా
మురారీ: పెళ్ళైన స్త్రీ పరాయి మగవాడి కోసం ఎదురుచూడటం సంస్కారం కాదు
Also Read: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం
ముకుంద: నాకు నీతో ఎప్పుడో మానసికంగా పెళ్లి అయ్యింది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీ అమ్మ చూచాయగా పసిగట్టారు. ఇవాళ ఆవిడ అనుమానమే నిజమని తేలిపోయింది. మన ప్రేమ గురించి రేవతి అత్తయ్యకి తెలిసిపోయింది
మురారీ: ఆట పట్టిస్తున్నావా నన్ను. మా అమ్మకి ఆ విషయం ఎలా తెలిసింది
ముకుంద: ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది. అందుకే నేనే చెప్పాను తప్పలేదు. ఆవిడ ప్రతిసారీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మనం ప్రేమికులం అన్న సంగతి నేను చెప్తే తెలియలేదు. ఆవిడకి ముందే తెలుసు అవునా అంటే అవునని అన్నాను
మురారీ: ఎందుకు అవును చెప్పావు ఆవిడ తట్టుకోగలదా
ముకుంద: నిజమని తెలిస్తే అబద్ధమని ఎలా చెప్తాను. చెప్తే ఏమవుతుంది. నేను ఒంటరిగా బతకడానికి కారణం నువ్వేనని చెప్పాను
మురారీ: కృష్ణ గురించి ఏడాది తర్వాత వెళ్లిపోతుందని మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పావా? అసలు ఎందుకు చెప్పావు నేను అమ్మ ముందు ఎలా తల ఎత్తుకోవాలి
ముకుంద: ఉన్నదే చెప్పాను ఎప్పుడొకప్పుడు కృష్ణ వెళ్ళిపోతుంది
Also Read: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద
మురారీ: పదే పదే ఆ మాట అనకు వినడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పటికీ ఇంట్లో పెట్టిన చిచ్చు చాలు నువ్వు అనడానికి రెడీ అయినా వినడానికి నేను రెడీగా లేను నన్ను ఇలా బతకనివ్వు
ప్రసాద్ ఇంట్లో తాగుతూ ఉంటే కొడుకు మధుకర్ వచ్చి తనకి పోయమని సోది పెడతాడు. వీడియోలు చూస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు కదా అని తల్లి వెనకేసుకొస్తుంది. మురారీ ఒంటరిగా కూర్చుని ప్రేమగా గురించి తను చెప్పిన మాటలు ఆలోచిస్తున్నాడు. నిన్న మొన్నటిదాకా తెరిచిన పుస్తకంలా ఉన్నావ్ కానీ ఇప్పుడు అర్థం కావడం లేదు. గడువు అవగానే వెళ్లిపోదామని అనుకుంటున్నావా అని బాధపడతాడు. అటు రేవతి డల్ గా ఉండి ముకుంద గురించి ఆలోచిస్తుంది. కృష్ణ వచ్చి ఏమైందని అడిగితే ఏం లేదని వెళ్ళిపోతుంది. గడువు పూర్తి కాగానే ఏసీపీ సర్ నన్ను పంపించేస్తారా?అని కృష్ణ ఆవేదన చెందుతుంది.