అన్వేషించండి

Kichcha Sudeep : అమ్మా.. ఈ బాధ నావల్ల కావట్లేదు, మంచిగా రెస్ట్ తీసుకో.. తల్లి మరణాంతరం కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్

Kichcha Sudeep : అమ్మా.. ఈ మాటని, ఆ ప్రేమని వివరించడానికి ఎన్ని పదాలు కూర్చినా అది తక్కువే అవుతుంది. అలాంటి తల్లిని కోల్పోతే బాధ ఎలా ఉంటుందో.. రాస్తూ కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

Kichcha Sudeep Emotional Post for Mother : అమ్మ. ప్రతి ఒక్కరి జీవితంలో మేజర్ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమ్మలకు, అబ్బాయిలకు ఉండే బాండింగ్ చాలా ఎక్కువ. అలాంటి తల్లిని కోల్పోతే ఆ బాధను వర్ణించడం చాలా కష్టం. తన తల్లిని కోల్పోయిన నటుడు కిచ్చా సుదీప్ ఆమెపై ఉన్న ప్రేమను, ఒక్కరోజులో జరిగిన మార్పు తన జీవితాన్ని ఎలా శూన్యం చేసిందో చెప్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు. x వేదికగా తన తల్లితో ఉన్న ఫోటోను షేర్ చేసి.. తన మనసులోని ఆవేదనను రాసుకొచ్చారు సుదీప్. 

మనిషి రూపంలోని దేవతవి నువ్వు..

"నిష్పక్షపాతంగా నన్ను ప్రేమించి.. క్షమించి.. శ్రద్ధతో నన్ను పెంచి పెద్ద చేసిన నిన్ను నేను ఎప్పటికీ మరచిపోలేను అమ్మ.. మనిషి రూపంలో నాకు దొరికిన దేవుడివి నువ్వు. నువ్వే నా గురువు. నిజమైన శ్రేయోభిలాషివి. నా మొదటి ఫ్యాన్​వి. నాలోని లోపాలను కూడా ప్రేమించే వ్యక్తివి నువ్వు. అలాంటి నువ్వు ఇప్పుడు నాకు ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయావు. 

ఈ బాధ నావల్ల కావట్లేదు..

నువ్వు నాకు మిగిల్చిన ఈ బాధను నేను చెప్పలేకపోతున్నాను అమ్మ. నా దగ్గర పదాలు లేవు. నువ్వు లేని ఈ జీవితం నాకు శూన్యంగా ఉంది. ఇప్పటికీ నువ్వు లేవు అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఒక్కరోజులో.. కేవలం 24 గంటల్లో నా జీవితం అంతా మారిపోయింది. 

నీ మెసేజ్​ రాలేదమ్మా.. 

ప్రతి రోజు ఉదయం నీ మెసేజ్ వచ్చేది. ఉదయం 5.30 గంటలకు గుడ్ మార్నింగ్ కన్నా అని రోజూ విష్ చేసేదానివి. అక్టోబర్ 18వ తేదీన కూడా నీ మెసేజ్ అందుకున్నాను. ఆ రోజే నీ లాస్ట్ విష్ అని తెలియదు. ఎందుకంటే తర్వాత రోజు నీ మెసేజ్ నాకు రాలేదు. అక్టోబర్ 19వ తేదీన నేను బిగ్​బాస్ షూట్​లో ఉందని లేచాను. నీ మెసేజ్ నాకు రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా జరగడం మొదటిసారి. సరే అని నేనే నీకు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశాను. నీకు ఫోన్ చేయాలనుకున్నాను అమ్మ.. అంతా ఓకేనా కాదా అని అడగాలనుకున్నాను. కానీ బీబీ షూట్ ఉండడంతో నా టైమ్​ దానికే సరిపోయింది. 

స్టేజ్​పైకి వెళ్లే ముందు నాకు ఫోన్ వచ్చింది. అమ్మ ఆస్పత్రిలో చేరిందని. నేను వెంటనే సిస్టర్​కి కాల్ చేసి.. అక్కడి డాక్టర్స్​తో మాట్లాడి స్టేజ్​ మీదకి వెళ్లాను. నేను ఇంకా స్టేజ్​ మీదే ఉన్నాను.. నువ్వు వెంటిలేటర్​పై ఉంచారనే మెసేజ్ నాకు వచ్చింది. మొదటిసారి నా జీవితంలో నిస్సహాయతను అనుభవించాను. అయినా సరే షూట్​ని కంప్లీట్ చేశాను. ఇంత బాధలోనూ ఆ షూట్​ని కంప్లీట్ చేశానంటే.. మా అమ్మ నాకు నేర్పించిన పాఠమే. దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానమ్మా. 

ఉదయాన్నే గొడవపడ్డావుగా అమ్మా.. 

షూటింగ్ ముగించుకుని నేను ఆస్పత్రికి వచ్చాను. కానీ నువ్వు వెంటిలేటర్​పై ఉన్నావు. నువ్వు స్పృహలో ఉండగా నేను చూడలేకపోయాను. ఆదివారం తెల్లవారుజామునే నువ్వు లేచావు. నాతో గొడవ పెట్టుకున్నావు. కానీ కొన్ని గంటల్లోనే అన్ని మారిపోయాయి. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ. ఈ నిజాన్ని ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. షూట్​కి వెళ్లే ముందు గట్టిగా హగ్ చేసుకున్న నువ్వు కొన్ని గంటల్లోనే నాకు దూరమయ్యావు. 

ఒప్పుకోవాల్సిన చేదు నిజం..

కానీ ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కానీ దీనిని అర్థం చేసుకోవడాని.. నా హార్ట్ ఇది తీసుకోవడానికి టైమ్ పడుతుంది. My mother was a great soul, and I will miss her. I for sure know yesterday, being an auspicious day was nature's and God's choice to take her from this earth. అమ్మకు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నేరుగా, మెసేజ్​లు, ట్వీట్ల ద్వారా నాకు సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. 

అమ్మ నా జీవితంలో అత్యంత విలువైన, ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నీకు ఇప్పుడు శాంతి దొరికిందని నేను అనుకుంటున్నారు. బాగా రెస్ట్ తీసుకోమ్మ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అమ్మ. 

ఇట్లు 

నీ దీపు."

అంటూ కిచ్చా సుదీప్ తన తల్లిగురించి ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు. ఆయన అభిమానులు సుదీప్ స్ట్రాంగ్​గా ఉండాలంటూ కోరుకుంటున్నారు. సుదీప్ తల్లి సరోజా (86)అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 20వ తేదీన ప్రాణాలు విడిచారు. 

Also Read : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, స్టార్ యాక్టర్ తల్లి కన్నుమూత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget