అన్వేషించండి

Kichcha Sudeep: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, స్టార్ యాక్టర్ తల్లి కన్నుమూత

Kichcha Sudeep : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

Kichcha Sudeep's mother Death : కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన తల్లి సరోజా సంజీవ్ చనిపోయారు. 86 ఏళ్ల వయసున్న ఆమె గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు జయనగర్‌లోని అపోలోలో ఆసుపత్రిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వయో సంబంధ అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్యుల బృందం స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చనిపోయిందన్నారు. అనంతరం ఆమె పార్దివదేహాన్ని హాస్పిటల్ నుంచి జేపీ నగర్ లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సరోజా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల సంతాపం

సరోజా సంజీవ్ చనిపోయినట్లు తెలియడంతో కన్నడ సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు సంతాపాన్ని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. మరోవైపు సినీ పెద్దలు కిచ్చా సుదీప్ ఇంటికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. సుదీప్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్తున్నారు. కన్నడ సినిమా పరిశ్రమపై ఆమెకు ఎంతో గౌరవం ఉందని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆ గౌరవంతోనే తన కుటుంబ సభ్యులను ఇండస్ట్రీలో అడుగు పెట్టేలా చేసిందని గుర్తు చేసుకుంటున్నారు.

తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సుదీప్

కిచ్చా సుదీప్ కు తన తల్లి సరోజా అంటే ఎనలేని ప్రేమ, గౌరవం. వీలు దొరికినప్పుడల్లా ఆమె గురించి గొప్పగా చెప్పేవారు. రీసెంట్ గా బిగ్ బాస్ స్టేజి మీద కూడా తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆమె చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  

‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు..

కిచ్చా సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, నాని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో ఆయన విలన్ గా నటించారు. తొలి సినిమాతోనే ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’లో ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందినా, తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ యాంకర్ గా, సింగర్ గానూ రాణించారు.  గత కొంతకాలంగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా గుర్తింపు పొందారు. 2013లో భారత్ లో టాప్ 100 ప్రముఖుల ఫోర్బ్స్ లిస్టులో ఆయన స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.    

Read Also: ఖుబానీ కా మీఠా, వెజ్ షీక్ కబాబ్స్ - పిస్తా హౌస్​లో హైదరాబాద్ ఫుడ్ టేస్టీ చేసిన బాలీవుడ్ హీరో

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Rashmika Mandanna : రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget