అన్వేషించండి

Kartik Aaryan : ఖుబానీ కా మీఠా, వెజ్ షీక్ కబాబ్స్ - పిస్తా హౌస్​లో హైదరాబాద్ ఫుడ్ టేస్టీ చేసిన బాలీవుడ్ హీరో

సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన కార్తీక్ ఆర్యన్, పిస్తా హౌస్ లో సందడి చేశారు. రెస్టారెంట్లో ఇష్టమైన వెజ్ ఐటెమ్స్ టేస్ట్ చేశారు. తన లైఫ్ లో తిన్న బెస్ట్ ఫుడ్ అంటూ ప్రశంసలు కురిపించారు.

Kartik Aaryan In Pista House : బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ భాగ్యనగరంలో సందడి చేశారు. ‘భూల్ భూలయ్యా 3‘ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఈ యంగ్ హీరో, పిస్తా హౌస్ కు వెళ్లి ఫుడ్ టేస్ట్ చేశారు. ప్రమోషనల్ ఈవెంట్ తర్వాత, కార్తీక్ తన టీమ్ తో కలిసి గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ కు వెళ్లారు. హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ లో తనకు ఇష్టమైన ఫుడ్ రుచి చూశారు.   

వెజ్ ఐటెమ్స్ టేస్ట్ చేసిన కార్తీక్

శాకాహారి అయిన కార్తిక్ ఆర్యన్, పిస్తా హౌస్ లో ఫేమస్ వెజ్ ఫుడ్స్ ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. వెజ్ కబాబ్స్, వెజ్ షీక్ కబాబ్స్, వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసి వాటిని లొట్టలేసుకుంటూ తినేశారు. వెజ్ బిర్యానీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు తాను తిన్న బెస్ట్ వెజ్ బిర్యానీ ఇదే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, హైదరాబాదీ సంప్రదాయ డెజర్ట్ తో తన డిన్నర్ ను ఫినిష్ చేశారు. నేరేడు పండ్లతో చేసిన ఖుబానీ కా మీఠాను ఎంతో ఇష్టంగా లాగించేశారు. తన జీవితంలో పిస్తా హౌస్ లో తిన్న ఫుడ్ ను మర్చిపోలేనని కార్తీక్ చెప్పుకొచ్చారు. చక్కటి ఫుడ్ అందిస్తున్న పిస్తా హౌస్ నిర్వాహకులను ఆయన అభినందించారు.

కార్తీక్ రాకపై పిస్తా హౌస్ యజమాని సంతోషం

బాలీవుడ్ స్టార్ హీరో తమ రెస్టారెంట్ లో ఫుడ్ తినడానికి రావడంపై పిస్తా హౌస్ యజమాని మహమ్మద్ అబ్దుల్ మొహ్సీ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ రెస్టారెంట్ కు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారని, ఇప్పుడు కార్తీక్ కూడా రావడం సంతోషంగా ఉందన్నారు.  హైదరాబాదీ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు. తన రెస్టారెంట్ కు మరింత మంది సెలబ్రిటీలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్తీక్ ఆర్యన్ తమ ఫుడ్ టేస్టీ చేసి చాలా మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ పిస్తా హౌస్ కు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సారా అలీ ఖాన్‌లతో సహా పలువురు తారలు ఇక్కడి వంటకాలకు ఫిదా అయ్యారు. హైదరాబాదీ బిర్యానీ తిని మైమరచిపోయారు.  

దీపావళికి ‘భూల్ భూలయ్యా-3‘ విడుదల

విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘భూల్ భూలయ్యా-3‘ సినిమాలో త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాను అనీస్ బాజ్మీ తెరకెక్కించారు. గతంలో ఈ సిరీస్‌ లో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న పార్ట్ 3 పైనా కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌ లో వస్తోన్న ‘సింగం ఎగైన్‌‘ తో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతోంది.

Read Also: ‘మున్నాభాయ్ 3’పై రాజ్‌కుమార్ క్రేజీ అప్ డేట్, సంజూ భాయ్ ఫ్యాన్స్ కు పండగే పండుగ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Embed widget