అన్వేషించండి

Rajkumar Hirani: ‘మున్నాభాయ్ 3’పై రాజ్‌కుమార్ క్రేజీ అప్ డేట్, సంజూ భాయ్ ఫ్యాన్స్ కు పండగే పండుగ!

‘మున్నాభాయ్ 3’ గురించి దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Rajkumar Hirani Gives An Update On Munna Bhai 3: బాలీవుడ్ లో సుమారు 20 ఏండ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఆ తర్వాత వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయ. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘మున్నాభాయ్ 3’ గురించి ఇండస్ట్రీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ‘మున్నాభాయ్’ ప్రాంచైజీని తీసుకురావాలని సినీ అభిమానులు కోరుతున్నారు. కానీ అది ఇంత‌వ‌ర‌కూ సాధ్య‌ప‌డలేదు. దీనిపై ఏనాడు రాజ్ కుమార్ హిరానీ కూడా స్పందించలేదు. సినిమాను తీస్తానని గానీ, తీయ‌నని గానీ చెప్పలేదు. దీంతో ఆ ప్ర‌చారం అలా కంటిన్యూ అవుతోంది. ఎట్టకేలకు రాజ్ కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ 3’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మున్నాభాయ్ 3’ స్క్రిప్ట్ రెడీ అవుతోంది- రాజ్ కుమార్ హిరానీ

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ‘మున్నాభాయ్ 3’ గురించి రాజ్ కుమార్ హిరానీ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ‘మున్నాభాయ్ 3’ తన టాప్ ప్రియారిటీలో ఉన్నట్లు చెప్పారు. “’మున్నాభాయ్ 3’ నా టాప్ ప్రియారిటీలో ఉంది. నేను ప్రస్తుతం కొన్ని స్క్రిప్టులు రెడీ చేస్తున్నాను. వాటిలో ‘మున్నాభాయ్ 3’ కూడా ఒకటి. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా, కష్టపడుతున్నాను. రాయడానికి ప్రయత్నిస్తున్నాను. సంజు(సంజయ్ దత్) కూడా మూడో భాగాన్ని తీయాలని కోరుతున్నారు. నా దగ్గర ప్రస్తుతం ‘మున్నాభాయ్ 3’కి సంబంధించి కంప్లీట్ కాని స్క్రిప్ట్ ఉంది. దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు.

‘మున్నాభాయ్ 3’పై క్లారిటీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కచ్చితంగా ‘మున్నాభాయ్ 3’ ఉంటుందని కన్ఫామ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాలకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ పేరుతో విడుదల కాగా, ‘లగేరహో మున్నాభాయ్’ మూవీని ‘శంకర్‌దాదా జిందాబాద్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.   

రీసెంట్ గా రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్ లో ‘డుంకీ’ అనే సినిమా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. గత ఏడాది క్రిస్మస్ కానుగా ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సతీష్ షా, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget