Audi 1st Female Brand Ambassador: ఆడీకి లేడీ అంబాసిడర్.. కియారాకు చాన్స్.. మొదటిసారి అలా!
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి ఆడీ బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం దక్కింది.
ఆడీ ఇండియాకు మొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ నిలిచింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ ఒక మహిళా అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారి. దీన్ని ఆడీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. ‘పురోగతి, సృజనాత్మకత ఒకేచోట ఉండాలి. కియారా అలీ అద్వానీని ఆడీ ఎక్స్‌పీరియన్స్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది.’ అన్నారు.
ఇంతకుముందు ఈ బ్రాండ్‌కు ప్రమోషన్ చేసిన విరాట్ కోహ్లీ, రీగ్-జేన్‌ల సరసన కియారా కూడా చేరింది. ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఉంది. తన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామ్ చరణ్, శంకర్‌ల సినిమాలో కూడా తనే హీరోయిన్.
ఈ సినిమాతో పాటు భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ తేరా, జగ్ జగ్ జీయో చిత్రాల్లో కూడా కియారా నటిస్తుంది. 2014లో ఫగ్లీ సినిమాతో కియారా అద్వానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదల అయిన ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీతో తనకు మంచి గుర్తింపు వచ్చింది.
తర్వాత భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో కూడా ఈ అందాల భామ అడుగుపెట్టింది. అదే సంవత్సరం వచ్చిన లస్ట్ స్టోరీస్‌తో బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కబీర్ సింగ్, షేర్ షాలు హిట్ అవ్వడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయంది.
తెలుగులో వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా సరే.. సెంటిమెంట్‌ను కూడా పక్కనపెట్టి రామ్‌చరణ్ మళ్లీ కియారాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు లైనప్‌లో ఉండే సినిమాలు హిట్ అయితే కియారా జోరు మరిన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది.
Progress and creativity go hand in hand. We’re happy to welcome @advani_kiara to the Audi experience.#FutureIsAnAttitude #AudiA8L pic.twitter.com/CuGimQDJok
— Audi India (@AudiIN) December 15, 2021
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్‌లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్షన్లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి