By: ABP Desam | Updated at : 13 Dec 2022 06:01 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Sukrithi Ambati/Instagram
‘కేరింత’ మూవీలో భావన పాత్రతో ఆకట్టుకున్న నటి సుకృతి గుర్తుందా? తాజాగా ఆమె అక్షయ్ సింగ్ అనే యువకుడిని పెళ్లాడింది. సుకృతి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుకృతి. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ లో ‘కేరింత’ సినిమాతో మంచి గర్తింపు తెచ్చుకుంది నటి సుకృతి. కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన సుకృతికి ‘కేరింత’ స్టార్ హంట్ తెలిసి, ఫొటోలు, నటించిన వీడియోలు పంపించింది. వాటిని చూసిన చిత్ర యూనిట్ సుకృతిని ‘భావన’ పాత్రకు ఎంపిక చేశారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది.
సుమంత్ అశ్విన్ నటించిన ఈ మూవీలో నూకరాజు గర్ల్ ఫ్రెండ్ భావనగా నటించింది సుకృతి. ఈ సినిమాలో శ్రీ దివ్య హీరోయిన్ అయినా సుకృతికే బాగా పేరొచ్చింది. ఈమెను సుకృతిగా కంటే భావన అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అంతలా ఆ సినిమాలో భావన పాత్రలో ఒదిగిపోయింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
గత కొంత కాలంగా సుకృతి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుకృతి. దీంతో పలువురు సెలబ్రెటీల తో పాటు ఆమె ఫాలోవర్స్ విషెస్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా అప్పట్లో షేర్ చేసింది సుకృతి.
అయితే మొదటి సినిమాతోనే మంచి గర్తింపు తెచ్చుకొని కూడా కొంతమంది నటీనటులు ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. వాస్తవానికి దానికి వేరు వేరే కారణాలు ఉండొచ్చు. సుకృతి కూడా అలాగే తొలి సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. సినిమాల కంటే ఎక్కువగా తన చదువు పై దృష్టి పెట్టడం కోసం సినిమాల నుంచి దూరం అయిందని సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో సుకృతి సోషల్ మీడియా మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ పలు హెర్బల్ కంపెనీల ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తూ కనిపిస్తుంది సుకృతి. ఏదేమైనా ‘కేరింత’ సినిమాతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న భావన పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల