ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. బెడ్ రెస్ట్ కు గురైన భారత స్టార్ ప్లేయర్
ఆస్ట్రేలియా టూర్ లో ఇటీవల బుమ్రా విశేషంగా రాణించాడు. అత్యుత్తమ ఆటతీరుతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. అలాగే డిసెంబర్ నెలకు గాను ఐసీసీ అవార్డును కూడా బుమ్రా సాధించాడు.
Bumrah Injury Update: 12 సంవత్సరాల తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించాలని కలలు కంటున్న భారత్ కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీమిండియాలో ముఖ్యమైన స్టార్ బెడ్ రెస్ట్ కు పరిమితమయ్యాడని తెలుస్తోంది. ఆ ఆటగాడు ఎవరో కాదు.. జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో అతను గాయపడ్డాడు. సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో వెన్ను నొప్పితో తను ఆస్పత్రికి వెళ్లాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో అతను బౌలింగ్ చేయలేదు. అయితే అతనికి అయిన గాయమేంటో ఇప్పటివరకు బీసీసీఐ క్లారిటీగా చెప్పలేదు. అయితే అతను ప్రస్తుతం గాయా కారణంగా బెడ్ రెస్టుకే పరిమితమయ్యాడని తెలుస్తోంది. వచ్చేవారం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఏ రోజు వెళతాడో అనే దానిపై క్లారిటీ లేదు.
వాపు ఎక్కడా..?
టీమిండియాను క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్న మాజీలను బుమ్రా గాయం అయోమయానికి గురి చేస్తోంది. బుమ్రాకు అయిన గాయం వెన్నులో ఎక్కడైందో ఇప్పటివరకు తెలియడం లేదు. గాయం తీవ్రతను బట్టి, గ్రేడులుగా విభజిస్తారు. గ్రేడ్ వన్ అయితే రెండు-మూడు వారాలు, గ్రేడ్ 2 అయితే మూడు నెలల వరకు, గ్రేడ్ 9 అయితే ఆరునెలల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వెన్నుకండరాల్లో గాయం అయితే త్వరగానే కోలుకునే అవకాశం ఉంటుందని, అయితే డిస్కులో ఇబ్బంది ఏర్పడితే అది గ్రేడ్ 2 లేదా మూడుకు గురయ్యే అవకాశముంటుందని తెలుస్తోంది. ఇదే జరిగితే నెలల తరబడి బుమ్రా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే వచ్చేవారం ఎన్సీఏకు చేరుకున్న తర్వాత మరిన్ని పరీక్షలు నిర్వహించి దీనిపై ఒక నిర్ణయానికి రావాలని బోర్డు యోచిస్తోంది. మున్ముందు చాంపియన్స్ ట్రోపీతోపాటు ఐపీఎల్, ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో బుమ్రా విషయంలో రిస్కు తీసుకోకూడదని బోర్దు భావిస్తోంది.
Also Read: ముంబైలోని కళ్లు చెదిరే కోహ్లీ మేన్షన్ ను చూశారా..? స్వయంగా కోహ్లీనే హోమ్ టూర్...
బుమ్రా కోసమే వెయిటింగ్..
నిజానికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి జట్లను ప్రకటించడానికి ఈనెల 13 వరకే సమయం ఉంది. భారత్ తప్ప అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి. బుమ్రా గాయం విషయం తేలిన తర్వాత ఈనెల 18 లేదా 19న ప్రకటించుకునేందుకు ఐసీసీ నుంచి బోర్డు పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రా చాంపియన్స్ ట్రోఫీ తొలి లీగ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. భారత్ ఆడబోయే దుబాయ్ లో బుమ్రా లేని లోటు కచ్చితంగా నిరాశను కలిగించేదని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు వచ్చేవారం గడిస్తే కానీ, బుమ్రా ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్సీఏలో బుమ్రా పరిస్థితి అంచనా వేసి మెగాటోర్నీకి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ప్రకటించిన జట్టులో ఫిబ్రవరి 13 వరకు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశముంది. వచ్చేనెల 20 నుంచి మెగాటోర్నీలో భారత్ మ్యాచ్ లు ఆరంభమవుతాయి.
Also Read: Rohit Vs BCCI: రోహిత్ సంచలన నిర్ణయం! - పాక్‌లో టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ఛాన్స్?, డైలమాలో బీసీసీఐ