Viral Video: ముంబైలోని కళ్లు చెదిరే కోహ్లీ మేన్షన్ ను చూశారా..? స్వయంగా కోహ్లీనే హోమ్ టూర్...
Viral Video: టెస్టు జట్టులో చోటు నిలుపుకోవడం కోసం భారత క్రికెటర్లు రంజీ బాట పడుతుండగా, కోహ్లీ మాత్రం ఇప్పటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంగ్లాండ్ టూర్ కు ముందు తను కౌంటీల్లో ఆడతాడని తెలుస్తోంది.
Virat Kohli News: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ సినీ నటి అనుష్క శర్మ దంపతులు ముంబైలో అడుగు పెట్టడం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ సెలెబ్రిటి జంట తాజాగా ఖరీదైన తమ విల్లాను దర్శించుకున్నారు. అలీబాగ్ లో ఉన్న ఈ మేన్షన్ ను అద్భుతమైన రీతిలో నిర్మించారు. ఈ మేన్షన్ కు సంబంధించిన వీడియోను కోహ్లీ పంచుకున్నాడు. ఈ మేన్షన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. స్టెఫాన్ అంటోనీ ఒల్మెస్ దహల్ ట్రూవన్ అర్కిటెక్ట్స్ అనే సంస్థ నిర్మించింది. దీన్ని ఫిలిఫ్ ఫౌచ్ నిర్వహిస్తున్నారు. ముంబైలో విశ్రాంతి సమయాన్ని గడపడం కోసం ఈ విల్లాను ఉపయోగిస్తారు. ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలాన్ని గతంలో 19 కోట్లకు కోహ్లీ కొనుగోలు చేశాడు. మరో 10.5 నుంచి 13 కోట్ల రూపాయలు వెచ్చించి, అధునాతనంగా అన్ని సౌకర్యాలతో దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. మాములుగా నివాసం కోసం కోహ్లీ.. ముంబైలోని రూ.32 కోట్ల భవంతిలో నివాసం ఉంటున్నాడు. అతనికి గురుగ్రామ్ లో కూడా రూ.80 కోట్ల భవనం ఉన్నట్లు సమాచారం.
Tour of Virat Kohli's holiday home in Alibaug! 😍@imVkohli • #ViratKohli𓃵 • #ViratGang pic.twitter.com/em8lVQHHdr
— ViratGang (@ViratGang) January 10, 2024
పదివేల స్క్వేర్ ఫీట్లలో..
విహారం కోసం కోహ్లీ జంట ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ విల్లా దాదాపు 10 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయి. టెంపరేచర్ కంట్రల్ చేసే పూల్ తో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన కిచెన్, నాలుగు బాత్ రూములు, విలాసవంతమైన స్నానపు తొట్టి, అందమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ తదితర సౌకర్యాలతో ఈ విల్లాను ఏర్పాటు చేశారు. అలాగే ఖరీదైన ఇటాలియన్ మార్బల్, ప్రిస్టైన్ స్టోన్స్, టర్కిష్ లైమ్ స్టోన్స్ తో సర్వాంగ సుందరంగా ఈ మేన్షన్ ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మేన్షన్ వివరాలను కోహ్లీ వెల్లడిస్తున్న వీడియో వైరలైంది. అభిమానులు లేకులు, కామెంట్లతో తమ స్పందన చేస్తూ, వీడియోను షేర్ చేస్తున్నారు.
రంజీల్లో కోహ్లీ ఆడతాడా..?
గతేడాది సెకండ్ హాఫ్ నుంచి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ.. తిరిగి జట్టులో కుదురుకోవాలని భావిస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా టూర్లో కోహ్లీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ టూర్లో ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఒకే రకంగా కోహ్లీ ఔటవడం గమనార్హం. ముఖ్యంగా స్కాట్ బోలాండ్ తనను నాలుగు సార్లు పెవిలియన్ కి పంపించాడు. దీంతో కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కోచ్ గౌతం గంభీర్ సూచనపై ఇప్పటికే పలువురు భారత ప్లేయర్లు రంజీలు ఆడాలని నిర్ణయించుకోవడంతో కోహ్లీ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడని అభిమానులు భావించారు. సొంత జట్టు ఢిల్లీ రంజీ ప్రాబబుల్స్ లో కోహ్లీకి స్థానం కూడా కల్పించారు. అయితే అతను ఆడేది లేదని ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు రంజీ టీమ్ తో కలవకపోవడంతో ఈనెల 23 నుంచి జరిగే ఈ టోర్నీలో తను ఆడేది డౌటేనని తెలుస్తోంది. ఇక వచ్చేనెల 6 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఆడనుంది. ఆ సిరీస్ లో కోహ్లీ సత్తా చాటుతాడని పలువురు నమ్మకంగా ఉన్నారు.