By: ABP Desam | Updated at : 24 Jan 2022 07:52 PM (IST)
Edited By: RamaLakshmibai
image credit : ZEE TELUGU /Twitter
సింగర్ మనో టెలివిజన్ నటుడిగా పరిచయం అవుతున్న సరికొత్త సీరియల్ కళ్యాణం కమనీయం. గతంలో అఖిలాండేశ్వరిగా జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన హరిత రెండేళ్ల తర్వాత సీతారత్నంగా వస్తున్నారు. జనవరి 31న రాత్రి 7.30 గంటలకు తొలి ఎపిసోడ్ మొదలు కానుంది. అమ్మ కోసం అన్వేషిస్తున్న ఇద్దరి కూతుళ్ల కథ ఇది. తన పిల్లలని ఎప్పటికైనా కలుసుకోవాలి, కళ్లారా చూసుకోవాలని ఓ అమ్మ వేదన ఈ కథ.
అమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టిన కన్న కూతుళ్లు..
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 23, 2022
అసలైన పేగు బంధానికి నిలువెత్తు సాక్ష్యం #KalyanamKamaneeyam
చూడండి జనవరి 31 న ప్రారంభం సోమ - శని రా|| 7:30 ని||లకు మీ జీ తెలుగులో..#MuthyamanthaMuddu జనవరి 31 వ తేదీ నుండి సోమ - శని 12:30 ని లకు మీ జీ తెలుగులో.. #ZeeTelugu pic.twitter.com/mf9k7taltX
కథ విషయానికొస్తే, సీతారత్నం (హరిత) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్) ఫీజియోథెరపిస్ట్. తండ్రి ( సింగర్ మనో) ఆఖరి నిముషంలో అమ్మ గురించి నిజాన్ని చెప్పి కన్నుమూస్తాడు. అప్పుడు అమ్మ గురించి అన్వేషణ ప్రారంభించిన అక్కాచెల్లెళ్లు సీతారత్నం చెంతకి చేరుతారు. అదే సమయంలో సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు) కి ఎదురునిలబడుతుంది డాక్టర్ చైత్ర. రాక్ స్టార్, డాక్టర్ మధ్య గొడవ తగ్గి ప్రేమ ఎలా మొదలైంది. సీతారత్నానికి వాళ్లే తన పిల్లలు అనే నిజం తెలుస్తుందా.. తల్లీ కూతుర్లు ఒక్క టయ్యేదెప్పుడు..ఇదే కళ్యాణం కమనీయం కథ.
సీతారత్నం -తల్లి లేని బిడ్డలకు అమ్మగా మారి అమ్మ ప్రేమను అందిస్తుంది
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 24, 2022
'కళ్యాణం కమనీయం ' సరికొత్త ధారావాహిక జనవరి 31 వ నుండి రా || 7:30 నిం || లకు మీ జీ తెలుగు లో#Haritha pic.twitter.com/GAFcz5o4YF
రెండేళ్ల తర్వాత జీ తెలుగులో అడుగుపెట్టిన హరిత...తనకు పుట్టించికి వచ్చినంత ఆనందం కలుగుతోందన్నారు. పిల్లల కోసం తల్లిపడే తపన, ఆరాటం..ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని, తనను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. మరి సీతారత్నం, చైత్ర మరియు విరాజ్ జీవితాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో తెలియాలంటే ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ చూడాల్సిందే. ఈ జనవరి 31 నుంచి రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Sangeetha Sajith Demise: కిడ్నీ సమస్యతో ప్రముఖ గాయని మృతి
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?