అన్వేషించండి
KRK Trailer: స్టార్ హీరోయిన్లతో చెంపదెబ్బలు తిన్న విజయ్ సేతుపతి
సమంత, నయన తార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కాతు వాక్కులా రెండు కాదల్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

స్టార్ హీరోయిన్లతో చెంపదెబ్బలు తిన్న విజయ్ సేతుపతి
సమంత, నయన తార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కాతు వాక్కులా రెండు కాదల్'. తెలుగులో ఈ చిత్రాన్ని 'కణ్మణీ రాంబో ఖతీజా' టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతో వినోదాత్మకంగా ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'టూ టుటు టుటూ' అనే సాంగ్ విడుదలైంది.
ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడే హీరో, వారి మధ్య సాగే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. 'ఖుషి'లో దీపం సీన్ తో ఈ సినిమా ట్రైలర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత సమంత, నయనతార ఇద్దరూ కూడా ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. అతడే మన హీరో విజయ్ సేతుపతి. అతడు కూడా ఈ ఇద్దరినీ ఎంతగానో ఇష్టపడతాడు.
అదే విషయాన్ని ఇద్దరికీ చెప్పినప్పుడు సమంత, నయనతార చెరొక చెంపదెబ్బ కొడతారు. ట్రైలర్ లో సన్నివేశాలన్నీ చాలా కామెడీగా ఉన్నాయి. ట్రైలర్ తోనే ఫన్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు దర్శకుడు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు.
View this post on Instagram
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















