Acharya: 'ఆచార్య' సెన్సార్ రివ్యూ - హైలైట్ ఎపిసోడ్స్ ఇవే
చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తోన్న 'ఆచార్య' సినిమా సెన్సార్ టాక్ బయటకొచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం.
రేపే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దీనికి పవన్ కళ్యాణ్, రాజమౌళి లాంటి సెలబ్రిటీలు గెస్ట్ లుగా రానున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ టాక్ బయటకొచ్చింది. మెగాఫ్యాన్స్ కు 'ఆచార్య' ఫుల్ మీల్స్ లా ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్స్ సీన్లు అభిమానులకు ఐఫీస్ట్ అని.. అంత అద్భుతంగా వచ్చాయని చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని.. మెగాస్టార్, రామ్ చరణ్ ల పెర్ఫార్మన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారని అంటున్నారు. సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిందని.. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ కనిపించరని సమాచారం. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టాక్. మెగాభిమానులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు.
సెన్సార్ టాక్ ను బట్టి చూస్తుంటే ఈఏడాది బ్లాక్ బస్టర్స్ లో 'ఆచార్య' కూడా ఒకటిగా నిలవనుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ఇచ్చేలా సినిమాను రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. నైజాం హక్కులు రూ.42 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా రూ.133 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ
Witness the 'U'ltimate 'A'ction in cinemas from APRIL 29 💥💥#Acharya #AcharyaOnApr29
— Matinee Entertainment (@MatineeEnt) April 22, 2022
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/PkF1girvrh
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















