By: ABP Desam | Updated at : 22 Apr 2022 11:12 AM (IST)
కార్తికేయ, సిరివెన్నెల (ఫైల్ ఫోటో)
Sirivennela Seetharama Sastry Last Song: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అభిమానులకు శుభవార్త. తెలుగు తెరపై మరోసారి ఆయన సాహిత్యపు జల్లులు కురిసే రోజు ముందుంది. సిరివెన్నెల పాటతో యువ హీరో కార్తికేయ సినిమా ఒకటి రానుంది. ఈ రోజు ఆ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
Neha Shetty to romance Kartikeya Gummakonda In Loukya Entertainments Movie: కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఒక చిత్రం రూపొందుతోంది. 'కలర్ ఫొటో', 'తెల్లవారితే గురువారం' తర్వాత బన్నీ (రవీంద్ర బెనర్జీ) ముప్పానేని నిర్మిస్తున్న చిత్రమిది. క్లాక్స్ (Director Clax) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా స్క్రిప్ట్ అందించారు. అనంతరం నిర్మాత బెన్నీ (Ravindra Banerjee Muppaneni) మాట్లాడుతూ "కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు. ఆయన రాసిన ఆఖరి పాట ఇదే" అని చెప్పారు.
"డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్‌లో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో అలా జీవించలేరు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా... తనకు నచ్చినట్టు జీవిస్తూ, తనదైన దారిలో వెళ్లే ఓ యువకుడి కథ ఇది" అని దర్శకుడు క్లాక్స్ తెలిపారు.
Also Read: కాజల్ కుమారుడిది తల్లి పోలికా? తండ్రి పోలికా? నిషా ఏం చెబుతున్నారంటే?
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి.
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం